కదులుతున్న బస్సులో మహిళపై దారుణం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న బస్సులో మహిళను అత్యాచారం చేశారు. నిర్మల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు వెళుతున్న బస్సులో మహిళపై ఈ అఘాయిత్యం జరిగింది. నోట్లో గుడ్డలు కుక్కి డ్రైవర్ తనపై అత్యాచారం చేశాడని డయల్ 100 ద్వారా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సమీపంలో బస్సును ఆపి, సీజ్ చేశారు. బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉండగా.. వారిలో ఒకరైన సిద్దయ్యను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో డ్రైవర్ కృష్ణ (ప్రధాన నిందితుడు) కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజేందర్ తెలిపారు.

లేడీ టెక్కీపై స్నేహితుల అత్యాచారం
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బాధితురాలి ఫిర్యాదుతో బయటపడింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరానికికు చెందిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తన స్నేహితులతో కలిసి ఓ హోటల్‌కు వెళ్లారు. మద్యం మత్తులో తన స్నేహితుడు మరో వ్యక్తితో కలిసి తనపై దారుణానికి ఒడిగట్టాడని మహిళ ఫిర్యాదులో తెలిపింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications