దౌర్జన్యం: బట్టలిప్పేసి, చెట్టుకు కట్టేసి వివాహితను కొట్టారు
సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో అమానవీయమైన సంఘటన చోటు చేసుకుంది. తమను తిడుతోందనే సాకుతో, పాత కుటుంబ తగాదాలు మనసులో పెట్టుకుని ఓ వివాహితను వివస్త్ర చేసి చెట్టుకు కట్టేసి కొట్టారు.
ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. మునగాల మండలం తిమ్మారెడ్డిగూడేనికి చెందిన బాధితురాలు గురువారం గ్రామంలో వేరే చోటికి వెళ్తుండగా గ్రామానికి చెందిన కొందరు కలిసి తమను ఎందుకు తిడుతున్నావని అడ్డుకొని దాడి చేశారు. ఆమెను వివస్త్రను చేసి చెట్టుకు కట్టేసి కొట్టారు.

ఆ సమయంలో అక్కడే ఉన్న గ్రామస్థులు కూడా మౌన ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. విషయం తెలుసుకున్న ఆమె భర్త గ్రామ పోలీస్ అధికారికి సమాచారం అందించారు. బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ విషయంపై స్థానిక ఎఎస్‌ఐ అహ్మద్‌జానీని వివరణ కోరగా దాడి జరిగినట్లు మౌఖికంగా చెప్పిందే తప్ప రాతపూర్వకంగా దరఖాస్తు ఇవ్వలేదన్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications