అమ్మ అలిగింది: 20 ఏళ్లుగా అన్నమే ముట్టలేదు...
అవును ఆ అమ్మ అలిగింది. ఒకటో రెండో రోజులు కాదండీ ఏకంగా 20 ఏళ్లుగా అమె అలకమానలేదు,అన్నం తినలేదు...
కరీంనగర్: అవును ఆ అమ్మ అలిగింది. ఒకటో రెండో రోజులు కాదండీ ఏకంగా 20 ఏళ్లుగా అమె అలకమానలేదు, అన్నం తినలేదు... వివాహం అనేది ఇద్దరు మనుషులకు సంభందించినది కాదు. రెండు మనసులకు సంబందించిన విషయమని,చాలా మంది అంటుంటారు. ఇది అక్షరాల నిజం అనటానికి ఈ స్టోరీ నిదర్శణం...
జగిత్యాల్ జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామానికి చెందిన ఈమె పేరు ఖాజమ్మ. చిన్నవయసులోనె ఖాజమ్మ తల్లీతండ్రులు ఆమెకు వివాహం చేశారు. అయితె భర్త అంటె ఇష్టం లేని ఖాజమ్మ అత్తారింటికి వెళ్లనని మెండికేసి కూర్చుంది.

ఇంకా అలక మానలేదు...
రెండురోజులు బ్రతిమిలాడిన ఖాజమ్మ తండ్రి అయూబ్, అత్తారింటికి వెళ్లనిదానికి అన్నం పెట్టడం దండుగ ఈ రోజు నుండి అన్నం పెట్టవద్దని తన బార్య అనిబీకి అదేశాలు జారీ చేశాడు. వారం పాటు అన్నం తినకుండా ఉన్న ఖాజమ్మ అలిగింది. అప్పుడు అలిగిన ఖాజమ్మ ఇరువై సంవత్సరాలు అవుతున్న ఇంకా అలకమానలేదు.

అన్నం తినలేదు...
అన్నం తినలేదు.అన్నం తినమని తల్లీదండ్రలు ఎన్నిరకాల బ్రతిమిలాడిన అమె ఒప్పుకోలేదు . అ క్షణం అన్నం తినటం మానేసిన ఖాజమ్మ అమ్మనాన్నలు చనిపోయిన తర్వాత కూడా తినలేదు. రోజుకు సుమార్ 40 టీలు, సంవత్సరానికి క్వింటాల్ పల్లీలు తింటుంది.

ఆరోగ్య సమస్యలు లేవు..
అన్నం తినకుండా ఉండటం వల్ల ఖాజమ్మకు ఇప్పటివరకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేవు, మరి మీరు అలకమానీ అన్నం తినచ్చు కదా అంటె మాత్రం నేను అలకమానను , అన్నం తినను అని అంటుంది.

ఆమెను చూస్తే తెలుస్తుంది..
కొందరు మెుండిగా ఉంటారు అంటారు.ఆ మెుండితనం సంవత్సరమో రెండు సంవత్సరాలో ఉంటుంది కానీ 20 ఏళ్లుగా అన్నం తినకుండా ఉంటుందా అనటానికి ఖాజమ్మ కథను చూస్తె తెలుస్తుంది..
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications