year ender 2022: తెలంగాణాలో దూకుడుగా బీజేపీ ప్రస్థానం.. కానీ అదొక్కటే లోపం!!
2022 సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దూకుడు కొనసాగింది. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా ఎదగాలని భావించిన బిజెపి 2022 సంవత్సరంలో ఆ ప్రయత్నంలో సఫలీకృతం అయ్యిందనే చెప్పాలి. కాకపోతే 2022 సంవత్సరం లో జరిగిన మునుగోడు ఉపఎన్నిక పరాజయం బిజెపికి ఒకింత నిరాశ కలిగించినప్పటికీ, ప్రజల్లో బిజెపికి పెరుగుతున్న మద్దతు బీజేపీ దూకుడును మరింత పెంచింది.

2022 లో దూకుడుగా ముందుకు వెళ్ళిన బీజేపీ
2022 వ సంవత్సరంలో బిజెపి సాగించిన ప్రయాణం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలోని అనేక సమస్యలపై బిజెపి పోరుబాట పట్టింది. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలు, ప్రజా గోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీలు, ప్రజా సమస్యలపై బిజెపి ఆందోళనలు, ధర్నాలు, దేశంలోని వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపీల లోక్ సభ ప్రభాస్ యోజన కార్యక్రమం వెరసి బిజెపి తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో 2022 సంవత్సరంలో సక్సెస్ అయింది. ఇక ఇదే సమయంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంతోపాటు, నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాల పై దృష్టిసారించిన బిజెపి వచ్చే ఎన్నికల కోసం 2022 సంవత్సరం నుండే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

2022 సంవత్సరం ప్రారంభంలోనే బండి సంజయ్ అరెస్ట్
తెలంగాణాలో బీజేపీ పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఉద్యోగులు ఉపాధ్యాయులు పక్షాన 317 జీవో సవరించాలని డిమాండ్ చేస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయనను అరెస్టు చేశారు. బండి సంజయ్ ను కోర్టులో హాజరు పరచి జైలుకు పంపించారు. ఇక బీజేపీ నాయకుల పై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని జేపీ నడ్డా అప్పుడే తెలంగాణ ప్రభుత్వం పై ఆరోపణలు గుప్పించారు. అప్పుడు మొదలైన రగడ నేటికీ ఏదో ఒక విషయంలో కొనసాగుతూనే ఉంది.

రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్.. బీజేపీ దీక్షలు
తెలంగాణ ముఖ్యమంత్రి భారత రాజ్యాంగ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మళ్లీ కెసిఆర్ రాజ్యాంగాన్ని అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర వ్యాప్తంగా భీమ్ దీక్షలు నిర్వహించారు. తెలంగాణ సీఎం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కి ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్, రాజా సింగ్ అసెంబ్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వం పై, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేయాలని భావిస్తే, వారిని అడ్డుకోవడం కోసం తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల నుండి బిజెపి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.

బడ్జెట్ సమావేశాల నుండి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం చేస్తున్న క్రమంలో, బడ్జెట్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బిజెపి ఎమ్మెల్యేలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభ నుంచి సస్పెండ్ చేశారు.ఈ బడ్జెట్ సెషన్ మొత్తం వారిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించడంతో బిజెపి నేతలు కోర్టు మెట్లు ఎక్కారు.తాజాగా ఈ వ్యవహారంలో తెలంగాణ బిజెపి ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురైంది. కోర్టు సస్పెన్షన్ పై స్టే ఇవ్వటం సాధ్యం కాదని పేర్కొంది. దీంతో మళ్లీ ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యనే కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయవలసి వచ్చింది. అయినప్పటికీ బిజెపి నాయకులు ప్రజల్లోకి వెళ్లడంలో, ప్రభుత్వ వైఫల్యాలను చెప్పడంలో సక్సెస్ అయ్యారు.

ప్రజా సంగ్రామ యాత్రలతో హోరెత్తించిన బండి సంజయ్
ప్రజా సంగ్రామ యాత్ర 2 నుండి ప్రజా సంగ్రామ యాత్ర 5 వరకు మొత్తం మూడు విడతల పాదయాత్రను సాగించిన బండి సంజయ్ అనేక నియోజకవర్గాలలో ప్రజల మద్దతును కూడగట్టారు. జనగామ జిల్లాలో బండి ప్రజా సంకల్ప పాదయాత్ర లో బీజేపీ టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య బాహాబాహీ చోటుచేసుకోవడంతో బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. ఆపై బండి సంజయ్ కోర్టు అనుమతితో తిరిగి పాదయాత్రను కొనసాగించారు. వరంగల్ లోని బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభను నిర్వహించడానికి కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో తిరిగి కోర్టును ఆశ్రయించిన బిజెపి, కోర్టు అనుమతితో సభను కొనసాగించింది. మొత్తంగా మూడు విడతల ప్రజా సంగ్రామ యాత్రను కొనసాగించారు.

జాతీయ నాయకుల పర్యటనలు.. సాలు దొర సెలవు దొర క్యాంపెయిన్
ఇక తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అగ్రనేతలు కూడా పర్యటిస్తూ తమ దృష్టి తెలంగాణపై ఉన్నట్టుగా అనేక మార్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా లో అనేకమార్లు తెలంగాణా లో పర్యటించారు. వారు సైతం రాష్ట్రంలోని అధికార ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణాలోని హైదరాబాద్ లో నిర్వహించి తెలంగాణా దృష్టిని ఆకర్షించారు బీజేపీ నాయకులు. ఇక సాలు దొర సెలవు దొర అంటూ బీజేపీ నిర్వహించిన డిజిటల్ క్యాంపెయిన్ కూడా తెలంగాణాలో ఉద్రిక్తతలకు కారణం అయ్యింది.

మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ పోరాటం .. ఓడినా మళ్ళీ దూకుడుగా ప్రజల్లోకి
ఇదిలా ఉంటే మునుగోడు ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ మునుగోడు ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని శతవిధాల పోరాటం చేసింది. అయితే మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ విజయం సాధించడం బిజెపికి ఒకింత మైనస్ అయినప్పటికీ, మునుగోడు పరాజయాన్ని పక్కనపెట్టి బిజెపి మళ్లీ ప్రజాక్షేత్రంలో దూకుడుగా ముందుకు వెళుతుంది. తెలంగాణ ప్రభుత్వం పై పోరాటం చేయడంలో బీజేపీ 2022 సంవత్సరం లో చాలా వరకు సక్సెస్ అయిందని చెప్పాలి. ఇక 2023 సంవత్సరంలో కూడా దూకుడుగా ప్రజల్లోకి వెళ్లి, ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారం హస్తగతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న బిజెపి, ఏ మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications