Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

year ender 2022: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పేరు.. బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్!!

2022 సంవత్సరం లో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించి, ఇప్పటికీ రాజకీయ ప్రకంపనలు రేకెత్తిస్తూనే ఉంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు పెద్ద ఎత్తున వినిపించడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రీకృతమైంది.

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్న కవిత

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇరుక్కున్న కవిత

ఢిల్లీ కేంద్రంగా జరిగిన లిక్కర్ కుంభకోణంలో, తెలంగాణ రాష్ట్ర వ్యాపారవేత్తలు, వారిని నడిపించిన కవిత పాత్ర ఉందని బిజెపి నాయకులు తీవ్ర ఆరోపణలు గుప్పించడంతో మొదలైన రగడ చిలికి చిలికి గాలివానగా మారింది. ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ, ఢిల్లీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మంజీందర్ సిర్సాఢిల్లీ లిక్కర్ స్కామ్ లోకవిత పాత్ర ఉందని, కెసిఆర్ కుటుంబ సభ్యుల సూచనలతోనే ఢిల్లీ మద్యం విధానాన్ని రూపొందించారని, మద్యం విధానానికి సంబంధించిన చర్చల్లో స్వయంగా కవిత పాల్గొన్నారని, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా, ఎక్సైజ్ అధికారులు,కెసిఆర్ కుటుంబ సభ్యులు సదరుహోటల్లో జరిగిన చర్చల్లో డీల్ కుదుర్చుకున్నారని వారు ఆరోపించారు.

కవితను టార్గెట్ చేసిన బీజేపీ నేతలు

కవితను టార్గెట్ చేసిన బీజేపీ నేతలు


అంతే కాదు కోకాపేటకు చెందిన రామచంద్రన్ పిళ్ళై అనే మద్యం వ్యాపారినిఢిల్లీలో వ్యాపారం చేయడానికి కవిత తీసుకువచ్చారని కూడా పేర్కొన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న మద్యం విధానాన్ని కెసిఆర్ కుటుంబ సభ్యులు పంజాబ్, ఢిల్లీ లలో అమలు చేయించారని కూడా వారు పేర్కొన్నారు. లిక్కర్ మాఫియా కమిషన్ నుపది శాతం పెంచేందుకు చేసుకున్న 150 కోట్ల రూపాయలడీల్ లో మొదటి విడత మొత్తం కవిత ద్వారాసిసోడియా కు ముట్టిందని వారు ఆరోపణలు గుప్పించారు. దీంతో ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్ర ఉందని తెలంగాణ బిజెపి నేతలు సైతం కవిత పై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు.

బీజేపీ నేతలపై కవిత పరువునష్టం దావా.,. డిఫెన్స్ లో కవిత

బీజేపీ నేతలపై కవిత పరువునష్టం దావా.,. డిఫెన్స్ లో కవిత


ఇక తనపై సంచలన ఆరోపణలు చేసిన బీజేపీ నేతల పై ఎమ్మెల్సీ కవిత పరువు నష్టం దావా వేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల కోర్టులలో పిటిషన్లు దాఖలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో తనకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. కెసిఆర్ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తా అని ప్రకటన చేయడంతో, కేంద్రం పై యుద్ధం ప్రకటించటంతో కావాలని కుట్రపూరితంగా తనపై బట్ట కాల్చి మీద వేస్తున్నారని కవిత ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలపై న్యాయపోరాటం చేస్తానన్నారు. ఇక ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రకంపనల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఈడీ దాడులు కొనసాగాయి. ముఖ్యంగా హైదరాబాద్లో రాబిన్ డిస్టిలరీ వ్యాపారి రామచంద్ర పిళ్ళైను ఈ వ్యవహారంలో నిందితుడిగా పేర్కొన్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సిబిఐ అభియోగం ఆధారంగా ఆయనపై కేసు నమోదు చేసింది. రామచంద్ర పిళ్ళై ఇళ్ళు, రాబిన్ డిస్టిలరీస్, రాబిన్ డిస్ట్రిబ్యూషన్సంస్థలలో తనిఖీలను నిర్వహించింది.

రాబిన్ డిస్టలరీస్ రామచంద్ర పిళ్ళై తో మొదలైన సోదాలు.. అభిషేక్ రావు, ప్రేమ్ సాగర్ ఇలా..

రాబిన్ డిస్టలరీస్ రామచంద్ర పిళ్ళై తో మొదలైన సోదాలు.. అభిషేక్ రావు, ప్రేమ్ సాగర్ ఇలా..


రాబిన్ సంస్థలలో ఆర్థిక మూలాలు, వాటిలో ఉన్న భాగస్వాములు ఎవరు అన్న అంశంపై దృష్టి సారించిన ఈడీ అధికారులు ఢిల్లీ కాంట్రాక్టు దక్కించుకున్న ఈ సంస్థల్లోకి నిధుల ప్రవాహం ఎలా జరిగిందన్న దానిపై లోతుగా దర్యాప్తు చేశారు. రాబిన్ సంస్థలో భాగస్వామిగా ఉన్న బోయినపల్లి అభిషేక్, ప్రేమ్ సాగర్ తదితరులపై దాడులు చేశారు. గోరంట్ల అసోసియేట్ సంస్థ నిర్వాహకుడు గోరంట్ల బుచ్చి బాబు ఇంటిపై కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు నిర్వహించిన అధికారులు కరీంనగర్ చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెన్నమనేని ని శ్రీనివాస్ ఇళ్లలోనూ కార్యాలయాల్లోనూ సోదాలు చేశారు. అంతేకాదు ఈ కేసులో మరో రెండు సాఫ్ట్వేర్ కంపెనీల్లో తనిఖీలు చేసిన వారు ఈ కేసు దర్యాప్తులో దూకుడు చూపించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం లో కేంద్ర సంస్థల కస్టడీలో శరత్ చంద్రారెడ్డి, బోయినపల్లి అభిషేక్

ఢిల్లీ లిక్కర్ స్కాం లో కేంద్ర సంస్థల కస్టడీలో శరత్ చంద్రారెడ్డి, బోయినపల్లి అభిషేక్


అరబిందో డైరెక్టర్ శరత్ చంద్ర రెడ్డి ని, మద్యం వ్యాపారి వినయ్ బాబును, బోయినపల్లి అశోక్ రావు ను కస్టడీలోకి తీసుకున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అనేక కీలక విషయాలను తమ దర్యాప్తులో గుర్తించారు. ఇక వారి విచారణ ఆధారంగా మరోమారు హైదరాబాద్ లో దాడులు నిర్వహించారు సిబిఐ అధికారులు, ఈడీ అధికారులు దర్యాప్తు చేసిన అనుమానితులు అందరికీ ఎమ్మెల్సీ కవితకు సంబంధాలు ఉండడంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత పేరు హాట్ టాపిక్ అయింది.

కవితను సాక్షిగా విచారించిన సీబీఐ.. మరోమారు నోటీసులు .. నిదానంగా కవితకు బిగుస్తున్న ఉచ్చు?

కవితను సాక్షిగా విచారించిన సీబీఐ.. మరోమారు నోటీసులు .. నిదానంగా కవితకు బిగుస్తున్న ఉచ్చు?


ఇక మొదటి నుంచి అనేకమార్లు నోటీసులు వస్తాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో కవితను సిబిఐ అధికారులు విచారించడానికి ఎట్టకేలకు ఫైనల్ గా నోటీసులు జారీ చేశారు. అయితే కవితని ఈ కేసులో సాక్షిగా మాత్రమే సిబిఐ అధికారులు విచారణ జరిపారు. అనేక నాటకీయ పరిణామాల మధ్య కవిత ను విచారించిన సిబిఐ అధికారులు సాక్ష్యాల కోసం ఆమెకు మరో నోటీసు ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేంద్రం తనను ఇరికించే కుట్ర చేస్తోందని, తాను పోరాటం విడిచి పెట్టేది లేదని తేల్చి చెప్పిన కవిత, కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణకు తాను సహకరిస్తానని చెబుతూనే కేంద్రం తీరు పై నిప్పులు చెరుగుతున్నారు. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కాం లో హైదరాబాద్ మద్యం వ్యాపారుల పాత్ర, క్రమక్రమంగా కవితకు చుట్టుకున్నట్టు కనిపిస్తుంది. ఇక ఈ కేసులో మరో మారు కవితను విచారించడానికి సిబిఐ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో, వచ్చే ఏడాది ఈ కేసులో మరెన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్నది ఆసక్తికరంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+