వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

year ender 2022: దేశ రాజకీయాల్లోకి గులాబీబాస్ కేసీఆర్ ఎంట్రీ.. మొదలైన బీఆర్ఎస్ ప్రస్థానం!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ చక్రం తిప్పడానికి 2022 వేదిక అయింది. 2022 ప్రారంభం నుండే కేంద్రంపై పోరాటం మొదలు పెట్టిన సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర అన్యాయం చేస్తుందని, తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని, తెలంగాణ పై చిన్నచూపు చూపిస్తుందని తీవ్రస్థాయిలో కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఇక జనగామ యశ్వంతపూర్లో జరిగిన బహిరంగ సభ వేదికగా సీఎం కేసీఆర్ ఖబడ్దార్‌ మోడీ.. తెలంగాణ పులిబిడ్డగా ఢిల్లీకోటను బద్దలు కొడతా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని తేల్చిచెప్పారు.

 సీఎం కేసీఆర్ ‘జాతీయ మిషన్’

సీఎం కేసీఆర్ ‘జాతీయ మిషన్’


ఆ తర్వాత జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాల్లోనూ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు, దేశంలో బిజెపికి ప్రత్యామ్నాయంగా మారతామని స్పష్టం చేశారు. దేశంలో బీజేపీ ని గద్దె దించడానికి ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడడానికి ప్రయత్నిస్తున్నాయని, ఆ కూటమికి తాను ప్రాతినిధ్యం వహించాలని భావిస్తున్నానని సీఎం కేసీఆర్ మనసులో మాట చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి గా మార్చాలని భావిస్తున్నట్లుగా కేసీఆర్ వెల్లడించారు. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించడం కోసం సీఎం కేసీఆర్ 'జాతీయ మిషన్'కు శ్రీకారం చుట్టి వారం రోజులపాటు దేశవ్యాప్త పర్యటన కు శ్రీకారం చుట్టారు.

వివిధ రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటనలు.. ఊహించని పరిణామాలు

వివిధ రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటనలు.. ఊహించని పరిణామాలు

జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడానికి, దేశాభివృద్ధికి కొత్త ఎజెండాను రూపొందించే ప్రయత్నాల్లో భాగంగా దేశంలోని వివిధ రంగాలు మరియు వివిధ ప్రాంతాల ప్రజలను కలుసుకోవడానికివారం రోజుల పర్యటనకు సిద్ధమయ్యారు. దేశానికి సరికొత్త దశ, దిశచూపించడం కోసం బిజెపికి ప్రత్యామ్నాయ అజెండా తీసుకువచ్చే విధంగా సీఎం కేసీఆర్ చేసిన దేశవ్యాప్త పర్యటన లో తొలిదశలో వారం రోజుల పాటు మొత్తం 8 రాష్ట్రాలు ప్రభావితమయ్యేలా కార్యక్రమాలు రూపొందించారు. కానీ ఊహించని విధంగా సీఎం కేసీఆర్ ఎనిమిది రాష్ట్రాలలో పర్యటించవలసి ఉన్నా,మహారాష్ట్ర , పశ్చిమ బెంగాల్, బీహార్ లలో పర్యటించకుండానేదేశ పర్యటనకు బ్రేక్ ఇచ్చారు. వివిధ రాష్ట్రాల సీఎంలతో భేటీ, ప్రతిపక్ష పార్టీలలో కలిసొచ్చే నాయకులతో భేటీ అయిన కేసీఆర్ వారందరినీ మూకుమ్మడిగా ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. చాలా చోట్ల కేసీఆర్ కు అవతలి వ్యక్తుల నుండి పెద్దగా స్పందన వచ్చిన దాఖలాలు లేవు. దీంతో కేసీఆర్ జాతీయ పార్టీ ప్రారంభిస్తారో లేదా అన్నది ప్రతి ఒక్కరిలో అనుమానాలను రేకెత్తించింది .

దేశ్ కీ నేత కేసీఆర్ .. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ

దేశ్ కీ నేత కేసీఆర్ .. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎంట్రీపై ఆసక్తికర చర్చ


ఇక జాతీయ పార్టీ ఏర్పాటుపై దృష్టి సారించిన కేసీఆర్ నేతలు, మేధావులతో సమాలోచనలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉండవల్లి అరుణ్ కుమార్ తో కెసిఆర్ చర్చించారు. ఇక జాతీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో, ప్రకాష్ రాజ్ తో, జేడీఎస్ నాయకుడు కుమారస్వామితో, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ తో కెసిఆర్ అనేకమార్లు భేటీ అయ్యారు. ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే, తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేటీఆర్ అవుతారని రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. జాతీయ రాజకీయాలను శాసించగలిగే స్థాయికి తమ పార్టీ ఎదిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చూపించే ప్రయత్నం కూడా కెసిఆర్ తన జాతీయ పార్టీతో పెద్ద ఎత్తున చేశారు. కేంద్రంలో అధికార బీజేపీ ని బలంగా ఢీ కొట్టాలంటే తనను మించిన నాయకుడు లేడని చెప్పే ప్రయత్నం చేశారు. దేశ్ కి నేత కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాల్లో సైతం జరిగిన ప్రచారం కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ని స్పష్టం చేసింది.

అక్టోబర్ 5 పార్టీ పేరు మార్పు తీర్మానం.. డిసెంబర్ 9 దీక్షా దివస్ నాడు బీఆర్ఎస్ ఆవిర్భావం

అక్టోబర్ 5 పార్టీ పేరు మార్పు తీర్మానం.. డిసెంబర్ 9 దీక్షా దివస్ నాడు బీఆర్ఎస్ ఆవిర్భావం

2022 సంవత్సరం ప్రారంభం నుండి, ఇప్పుడా అప్పుడా అని ఎదురుచూస్తున్న కెసిఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు కోసం అక్టోబర్ 5వ తేదీన దసరా రోజున తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం చేసి ఆ తీర్మానాన్ని ఆమోదించారు. పార్టీ కార్యకలాపాలను జాతీయస్థాయిలో విస్తరించడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్న కెసిఆర్ కేంద్ర ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ పేరును భారత రాష్ట్ర సమితి గా మార్చాలని లేఖ రాశారు. ఆపై డిసెంబరు 8 వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితి గా మారుస్తూ రాజముద్ర వేసింది. దీంతో అనూహ్యంగా సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దీక్ష చేసిన దీక్షా దివస్ నాడే, కెసిఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు.

2022 ఎండింగ్ లో జాతీయ పార్టీగా బీఆర్ఎస్.. మొదలైన జాతీయ రాజకీయ ప్రస్థానం

2022 ఎండింగ్ లో జాతీయ పార్టీగా బీఆర్ఎస్.. మొదలైన జాతీయ రాజకీయ ప్రస్థానం


దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి కెసిఆర్ బయలుదేరారు. సీఎం కేసీఆర్ కు మద్దతుగా సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, కర్ణాటక జెడిఎస్ నాయకుడు కుమారస్వామి, ప్రకాష్ రాజ్ వంటి నాయకులు ప్రస్తుతం కేసీఆర్ పక్కన చేరారు. డిసెంబర్ 14 వ తేదీన ఢిల్లీలో బి ఆర్ ఎస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైతం వారు హాజరై కెసిఆర్ జాతీయ రాజకీయాలకు తమ మద్దతు ప్రకటించారు. మొత్తానికి 2022వ సంవత్సరంలో కెసిఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మరి కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రస్థానం ముందు ముందు ఏ విధంగా సాగుతుందో తెలియాల్సి ఉంది.

English summary
In the year 2022, KCR entered national politics. KCR, who had declared war on the Center from the beginning of 2022, formed the BRS party at the end of 2022 and raised the BRS flag at the Delhi platform.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X