year ender 2023: లేచి పడిన కెరటం తెలంగాణ బీజేపీ!
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి రెండు అసెంబ్లీ ఎన్నికలు దాదాపు ఏకపక్షంగా సాగినప్పటికీ.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రజల మద్దతు పొందేందుకు అధికార పక్షం తోపాటు ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అధికార బీఆర్ఎస్ పార్టీ తోపాటు కాంగ్రెస్, బీజేపీలు తమదే అధికారం అంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లాయి. చివరికి మాత్రం అందర్నీ ఆశ్చర్యపరుస్తూ కాంగ్రెస్ పార్టీకే తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు.
అయితే, ఈ అసెంబ్లీ ఎన్నికలను అధికార బీఆర్ఎస్ పార్టీ అంత తేలిగ్గా తీసుకోలేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు విస్తృత ప్రచారం నిర్వహించారు. అదే స్థాయిలో కాంగ్రెస్, బీజేపీలు కూడా జాతీయ నేతలతోపాటు రాష్ట్ర నేతలు తమ అభ్యర్థుల తరపున జోరుగా ఎన్నికల ప్రచారం చేశారు. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకూ తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన బీజేపీ.. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అధికారం చేపట్టే పార్టీ స్థాయి నుంచి మూడో స్థానంకు పడిపోవాల్సిన పరిస్థితికి వచ్చింది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్న సమయంలో ఆ పార్టీ గ్రామీణ స్థాయిలోకి బలంగా వెళ్లింది. బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. అంతేగాక, ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు వింటూ వారికి భరోసానిచ్చారు. మరోవైపు పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వనుందని రాజకీయ విశ్లేషకులు కూడా భావించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికలు, జరిగిన ఉపఎన్నికల్లోనూ బీజేపీ మంచి ఫలితాలను సాధించింది. ఈ క్రమంలోనే పలువురు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నేతులు కూడా బీజేపీలో చేరడం ఆ పార్టీకి మరింత బలం చేకూరింది. అయితే, ఎన్నికల ముందు బండి సంజయ్‌ను పార్టీ అధ్యక్షుడిగా తప్పించి.. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని మరోసారి పార్టీ అధ్యక్షుడిగా చేసింది అధిష్టానం. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర బీజేపీలో అయోమయ పరిస్థితి నెలకొంది. పార్టీ కార్యక్రమాలు క్రమంగా డీలాపడుతూ వచ్చాయి.

ఈ క్రమంలోనే కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి జీవం పోసినట్లయింది. ఓ వైపు బీజేపీ వెనకపడినట్లు కనిపించడంతో కాంగ్రెస్ పార్టీ తన జోరును పెంచింది. కర్ణాటక కాంగ్రెస్ నేతలతోపాటు జాతీయ నేతలు తెలంగాణలో విస్తృతంగా పర్యటించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గ్రామస్థాయిలో విస్తృతంగా పర్యటించి పార్టీ శ్రేణులను మేలుకొలిపింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని ప్రచారం బలంగా వినిపించారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ పార్టీకి మరింత కలిసి వచ్చే అంశంగా మారింది.
ఎన్నికలకు నెల రోజులు గడువుందనగా ప్రధాని నరేంద్ర మోడీతోపాటు బీజేపీ అగ్రనతేలు తెలంగాణలో పర్యటించి మరోసారి బీజేపీని బలంగా మార్చే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఆ పార్టీకి అనుకున్నంత స్థాయిలో ఫలితాలు రాలేదు. బీజేపీ అగ్రనేతలు చేసిన కీలక ప్రకటనలు కూడా బీజేపీని రెండోస్థానంలో కూడా నిలుపలేకపోయాయి.

అధికార బీఆర్ఎస్ పార్టీపై ఉన్న ప్రజా వ్యతిరేకతను, రాష్ట్ర బీజేపీ నాయకత్వ లోపాలను తమకు అనుకూలంగా మార్చుకున్న కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంచుకుని తెలంగాణలో అధికారానికి కావాల్సిన అసెంబ్లీ స్థానాల్లో గెలుపు నమోదు చేసి సంచలనం సృష్టించింది. దీంతో కాంగ్రెస్ పార్టీ పడిలేచిన కెరటంగా మారితే.. బీజేపీ మాత్రం లేచిపడిన కెరటంగా మారిందని చెప్పవచ్చు. ఏదేమైనా బీజేపీ ఎన్నికల ముందు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆ పార్టీని మూడోస్థానానికి నెట్టేసినట్లు తెలుస్తోంది. ఇదంతా బీజేపీ స్వయంకృపారాదమేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. లేదంటే అధికారం చేపట్టేంత స్థాయిలోకాకపోయినా.. 30-40 సీట్లు బీజేపీకి వచ్చేవని చెబుతున్నారు.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications