గేదె దూడపై యువకుడి అత్యాచారం.. ఇదేం సిగ్గుమాలిన పనిరా !!
కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు మృగాళ్లు దారుణాలకు ఒడిగడుతున్నారు. కామాంధుల పాశవిక చేష్టలకు ఇప్పటికే ఎందరో మహిళలు బలయ్యారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా అత్యాచారానికి గురైన వారు ఉన్నారు. ఇటీవల కాలంలో అయితే మనుషులపై తమ క్రూరత్వాన్ని చూపింది సరిపోక జంతువులపై సైతం విరుచుకుపడుతున్న ఘటనలు చూస్తూనే ఉంటున్నాం. లేటెస్ట్ గా మరోసారి సభ్య సమాజం కూడా తలదించుకునే ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఇటీవల వనపర్తి జిల్లాలో గేదెలపై అత్యాచారం చేస్తూ ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన ఘటన మరవక ముందే.. మెదక్ జిల్లాలో అలాంటి మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గేదె దూడపై ఓ యువకుడు అత్యాచారం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఈ దారుణ ఘటనతో నిర్ఘాంత పోయిన గ్రామస్తులు నిందితుడికి దేహశుద్ది చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామంలో జరగగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిరాములు అనే రైతు తన వ్యవసాయ క్షేత్రంలోని పాకలో పశువులను పెంచుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం మామూలుగా పశువులను కట్టేసి ఇంటికి వెళ్లిపోయాడు. అదే గ్రామంలో కూలీ పనులు చేస్తూ వచ్చిన బీహార్‌కు చెందిన రోహిత్ అనే యువకుడు.. రాత్రి 10 గంటల సమయంలో ఎవరూ లేకపోవడం గమనించి పాకలోకి దూరి ఏడాది వయసున్న గేదె దూడపై లైంగిక దాడి జరిపాడు.
సీసీటీవీలో బయటపడ్డ బండారం..
అయితే సిద్దిరాములు పశువుల పాకలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు ఈ ఘటన మొత్తాన్ని రికార్డు చేశాయి. తన మొబైల్‌లో అలర్ట్ రావడంతో వెంటనే ఆ దారుణాన్ని గమనించిన రైతు.. అక్కడికి చేరుకుని నిందితుడు రోహిత్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. దీంతో గ్రామస్థులు అతనికి దేహశుద్ధి చేసి అనంతరం పోలీసులకు అప్పగించారు. ఇక వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రోహిత్‌ను అదుపులోకి తీసుకుని IPC సెక్షన్లు, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని తెలిపారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications