యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు: లోకేష్, పవన్ కళ్యాణ్ విషెస్.. తారక్ స్పెషల్ పోస్ట్!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు ఈరోజు.. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి జూనియర్ ఎన్టీఆర్ కు అభిమానుల నుండి విషెస్ వెల్లువగా మారాయి.

నారా లోకేష్ విషెస్
ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో మరెన్నో పుట్టినరోజులు ఎన్టీఆర్ సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.

Young Tiger JR NTR Birthday Lokesh Pawan Kalyan Wishes Tarak Special Post

పవన్ కళ్యాణ్ విషెస్
ఇక మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఒక లేఖను విడుదల చేశారు. ప్రముఖ నాయకుడు శ్రీ ఎన్టీఆర్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ పేర్కొన్న పవన్ కళ్యాణ్ ఆస్కార్ పురస్కారం అందుకుని అంతర్జాతీయ స్థాయిలో సినీ ప్రియుల మెప్పు పొందారని వ్యాఖ్యానించారు.

హ్యాపీయస్ట్ బర్త్ డే టు మై డియరెస్ట్: రామ్ చరణ్ ట్వీట్
తనదైన అభినయం, నృత్యంతో అందరినీ ఆకట్టుకునే ఎన్టీఆర్ మరిన్ని విజయాలు అందుకోవాలని సంపూర్ణమైన సంతోషాన్ని పొందాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ కు రాంచరణ్ శుభాకాంక్షలు తెలియజేశాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో వారిద్దరూ కలిసి ఉన్న ఒక ఫోటోని ట్వీట్ చేసి హ్యాపీయస్ట్ బర్త్ డే టు మై డియరెస్ట్ అంటూ ఎన్టీఆర్ పై తనకున్న ప్రేమను వ్యక్తపరిచారు.

సోషల్ మీడియాలో తారక్ పోస్ట్
అల్లు అర్జున్ కూడా ఎన్టీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం నుంచి ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.సోషల్ మీడియా వేదికగా ఒక స్పెషల్ పోస్ట్ పెట్టిన ఆయన తనదైన శైలిలో స్పందించారు.

ఎంతో ఆనందంగా ఉందని స్పెషల్ పోస్ట్ పెట్టిన జూనియర్ ఎన్టీఆర్
ప్రియమైన అభిమానులారా.. నటుడిగా నా ప్రయాణం మొదలైన రోజు నుంచి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్స్.. మీ అసామాన్య ప్రేమకు కృతజ్ఞుడిని అంటూ పేర్కొన్నారు ఆదివారం విడుదలైన దేవర పాటకు మీ నుంచి వచ్చిన స్పందన ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, చిత్ర పరిశ్రమ వారికి ధన్యవాదాలు అంటూ జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్ ద్వారా అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+