విషాదం:పెళ్ళిరోజునే వరుడు ఆత్మహత్య, మరో వ్యక్తితో వధువు పెళ్ళి

దేవరకొండ: ఇష్టం లేని పెళ్ళి చేసుకొనేందుకు నిరాకరించిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే పెళ్ళీ ముహుర్తం సమీపిస్తున్న వరుడు అదృశ్యం కావడంతో అదే గ్రామానికి చెందిన మరో యువకుడితో యువతి వివాహన్ని చేసిన ఘటన నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేటలో ఆదివారం నాడు చోటు చేసుకొంది.

కుటుంబ పెద్దలు తమ పిల్లల వివాహం విషయంలో తీసుకొన్న నిర్ణయం ఓ యువకుడి ఆత్మహత్యకు దారితీసింది. మరో వైపు పెళ్ళీ పీటలపై వివాహన్ని రద్దు చేసుకోకుండా మరో యువకుడితో వధువుతో వివాహం జరిపించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

అక్క కూతురితో వివాహం ఇష్టం లేని ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ ఘటన నల్గొండ జిల్లాలోని చందంపేట మండలం చిత్రియా పరిధిలోని వెంకటిగానితండాలో ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

అక్క కూతురితో వివాహం ఇష్టం లేక యువకుడి ఆత్మహత్య

అక్క కూతురితో వివాహం ఇష్టం లేక యువకుడి ఆత్మహత్య

నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని చిత్రియాల పరిధిలోని వెంకటిగానితండాకు చెందిన నేనావత్ చంద్రు , ఇచ్చాలి దంపతుల కొడుకు నేనావత్ హరిలాల్‌తో తేల్దేవర్ పల్లి గ్రామపంచాయితీ పరిధిలోని మోత్యతండాకు చెందిన దశరథం , తారి దంపతుల కుమార్తె లక్ష్మి వివాహం చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయం తీసుకొన్నాయి. హరిలాల్‌కు లక్ష్మి స్వయానా అక్క కూతురు. అయితే ఈ వివాహం హరిలాల్‌కు ఇష్టం లేదు. దీంతో మే 12 వీరిద్దరి వివాహం జరగాల్సి ఉంది. అయితే వివాహం రోజున హరిలాల్ ఇంటి నుండి వెళ్ళిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డారు.ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.

మరో యువకుడితో వధువుకు వివాహం

మరో యువకుడితో వధువుకు వివాహం


నేనావత్ హరిలాల్ పెళ్ళి రోజున ఇంటి నుండి అదృశ్యమయ్యాడు. ముహుర్తం సమీపిస్తున్నా కానీ ఆయన ఆచూకీ లభ్యం కాలేదు అయితే ఈ విషయమై రెండు కుటుంబాల పెద్దలు ఆందోళన చెందారు. ముహుర్తం దాటినా కానీ హరిలాల్ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులను ఒప్పించి అదే గ్రామానికి చెందిన యువకుడితో యువతి వివాహం జరిపించారు.

తిమ్మాపురంలో యువకుడి శవం

తిమ్మాపురంలో యువకుడి శవం

మే 12వ తేదిన హరిలాల్ వివాహం జరగాల్సి ఉంది. అయితే ఈ వివాహం రోజునే హరిలాల్ ఇంటి నుండి వెళ్ళిపోయాడు. తిమ్మాపురం గ్రామ శివారులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్ళి రోజున తన ఆచూకీ దొరకకుండా జాగ్రత్తపడ్డాడు. కానీ, మరునాడు అంటే మే 13వ తేదిన తిమ్మాపురం సమీపంలో హరిలాల్ మృతదేహం వెలుగు చూసింది,పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని భావిస్తున్నారు.

 హరిలాల్ ఫ్యామిలీ విషాదం

హరిలాల్ ఫ్యామిలీ విషాదం

హరిలాల్ ఆత్మహత్యకు చేసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కొడుకు పెళ్ళి రోజునే ఆయన ఆత్మహత్యకు పాల్పడడం ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరో వైపు హరిలాల్ అక్క కుటుంబసభ్యులు కూడ తమ కూతురిని వేరే వ్యక్తితో వివాహం జరిపించారు. ఈ రెండు కుటుంబాలు అనుకొన్నట్టుగా ఈ వివాహం జరగకపోవడం ఈ రెండు ఫ్యామిలీల్లో ఇబ్బందులు కల్గించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+