సోషల్ మీడియాలో వ్యక్తిగత వీడియోలు: చెడిన యువతి పెళ్లి

హైదరాబాద్: ఓ యువతి వ్యక్తిగత వీడియోలో సోషల్ మీడియాలో పోస్టు చేసి వేధించిన యువకుడిని హైదరాబాద్ షీటీమ్స్ పోలీసులు అరెస్టు చేశారు. రూపేష్ అనే ఆ యువకుడి నిర్వాకం వల్ల యువతి పెళ్లి చెడిపోయింది. యువతి వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడమే కాకుండా వాటిని కాబోయే భర్తకు, అత్తామామలకు పంపించాడు.

ఓ ఆకాశరామన్న లేఖ రాసి వాటిని వారికి పోస్టు చేశాడు. ఆ వీడియోలు కావాలంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వాలని అతను యువతితో బేరానికి దిగాడు. అతని ఆగడాలను భరించలేక యువతి షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. దాంతో షీటీమ్స్ రంగంలోకి దిగి అతన్ని పట్టుకుంది. కేసును సైబర్ క్రైమ్ పోలీసులకు అప్పగించారు.

Youth arrested for harassing a girl posting videos

తనను ప్రేమించలేదని, తనతో పెళ్లికి అంగీకరించడం లేదని రూపేష్ ఆ యువతిపై కక్ష పెట్టుకున్నాడు. హైదరాబాదులో బిటెక్ చదువుతూ పింక్ నోటీస్ అందుకుని అతను రోడ్డు మీద పడ్డాడు. ఆ తర్వాత మెకానిక్ షెడ్డు పెట్టుకున్నాడు. కాలేజీలో తనకు పరిచయమైన అమ్మాయి వెంటపడుతూ తనను పెళ్లి చేసుకోవాలని వేధించడం ప్రారంభించాడు.

ఆమె పెళ్లికి అంగీకరించకుండా తల్లిదండ్రులు నిర్ణయించిన పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. దాంతో అతను వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి, కాబోయే అత్తామామలకు, భర్తకు వాటిని పంపించాడు. యువతికి తెలియకుండా అతను ఆమె వీడియోలను చిత్రీకరించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+