ఎమ్మెల్యే కృష్ణారావుపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: కూకట్‌పల్లి ఎమ్మెల్యే,టీఆర్ఎస్ నేత మాధవరం కృష్ణారావుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వీడియోలు పెట్టిన ఘటనలో కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు (కేపీహెచ్‌బీ) పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.
కేపీహెచ్‌బీ మూడో ఫేజ్‌కు చెందిన గోపాల్ చౌదరి శాసన సభ్యుడిని వ్యక్తిగతంగా నష్టపరిచేలా సోషల్ మీడియాలో దాదాపు 12 వీడియోలు పెట్టి, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఎమ్మెల్యేపై ఉన్న అభ్యంతరకర వ్యాఖ్యలు, వీడియోలు తీసేయాలని ఎమ్మెల్యే అనుచరులు సూచించినా వినలేదు.

అంతేకాదు, తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అతని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!