వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ కు స్వీట్లు తినిపించినప్పుడు తెలియదా కేసీఆర్: పోలవరంపై వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న వైఎస్ షర్మిల, భద్రాచలం ముంపు పై కెసిఆర్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు విషయంలో తాజాగా చోటు చేసుకున్న వివాదం నేపథ్యంలో వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు.

పోడు పట్టాలు కావాలంటే చీరలు లాగుతారా? ఇదేమైనా ధృతరాష్ట్ర పాలనా? వైఎస్ షర్మిల ధ్వజంపోడు పట్టాలు కావాలంటే చీరలు లాగుతారా? ఇదేమైనా ధృతరాష్ట్ర పాలనా? వైఎస్ షర్మిల ధ్వజం

పోలవరం వల్లే భద్రాచలానికి ముంపు వస్తే ఇన్నాళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు

పోలవరం వల్లే భద్రాచలానికి ముంపు వస్తే ఇన్నాళ్ళు ఎందుకు ప్రశ్నించలేదు


భద్రాచలం వరద ముంపుకు గురి కావడానికి కారణం ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడమే అని వైయస్ షర్మిల మండిపడ్డారు. వెంటనే గోదావరి కరకట్ట ఎత్తు పెంచాలని వైయస్ షర్మిల డిమాండ్ చేశారు. అంతేకాదు భద్రాచలం ముంపుకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణమైతే ఇన్నాళ్లు ఎందుకు ప్రశ్నించలేదని వైయస్ షర్మిల సూటి ప్రశ్న వేశారు. గతంలో పోలవరం ప్రాజెక్టు ను మెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు పోలవరం పై విమర్శ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు.

జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పిలిచి స్వీట్లు తినిపించినప్పుడు మీకీ విషయం గుర్తులేదా?

జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పిలిచి స్వీట్లు తినిపించినప్పుడు మీకీ విషయం గుర్తులేదా?


పక్క రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డిని స్వయంగా ఇంటికి పిలిచి స్వీట్లు తినిపించినప్పుడు, మీకు ఈ విషయం గుర్తు లేదా అని వైయస్ షర్మిల ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల భద్రాచలం మునిగిపోతుందని అప్పుడు తెలియదా అంటూ వైయస్ షర్మిల కెసిఆర్ ను నిలదీశారు. ప్రజలకు సహాయం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోకుండా పోలవరం ప్రాజెక్టును బూచిగా చూపించి టిఆర్ఎస్ ప్రభుత్వం సాకులు చెబుతోందంటూ వైయస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు

గాలిమోటార్ లో వ‌చ్చి గాలి మాటలు చెప్పి వెళ్లిపోయాడు కేసీఆర్

గాలిమోటార్ లో వ‌చ్చి గాలి మాటలు చెప్పి వెళ్లిపోయాడు కేసీఆర్


వరద బాధితులకు రూ.1 సహాయం కూడా చెయ్యకుండా కెసిఆర్ ప్రభుత్వం రోజుకో కథ చెబుతోంది అని వైయస్ షర్మిల నిప్పులు చెరిగారు. అంతేకాదు 2008లో వైయస్సార్ భ‌ద్రాచ‌లం క‌ర‌క‌ట్ట ఎత్తు పెంచాల‌ని ప‌నులు ప్రారంభిస్తే.. నేటికీ కెసిఆర్ పూర్తి చేయ‌లేదని వైయస్ షర్మిల విమర్శించారు . ఎనిమిదేండ్లుగా ముఖ్య‌మంత్రిగా ఉండి,భ‌ద్రాచ‌లానికి ఒక్క మంచి ప‌ని చేయ‌లేదని మండిపడ్డారు. గాలిమోటార్ లో వ‌చ్చి గాలి మాటలు చెప్పి వెళ్లిపోయాడు త‌ప్ప ఒక్క కాల‌నీ తిర‌గ‌లేదు అని ఎద్దేవా చేశారు.

నీ ఆలోచ‌న‌కు కాళేశ్వ‌రం బ‌లి అయిన‌ట్లు,భ‌ద్రాచ‌లం కూడా బ‌లి కావాలా?

నీ ఆలోచ‌న‌కు కాళేశ్వ‌రం బ‌లి అయిన‌ట్లు,భ‌ద్రాచ‌లం కూడా బ‌లి కావాలా?


క‌ట్ట మీద నిల‌బ‌డి పిట్ట క‌థ‌లు చెప్పాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.విదేశీ కుట్ర‌లు, క్లౌడ్ బ‌ర‌స్ట్ అంటూ కొత్త క‌థ అల్లాడు కెసిఆర్ అంటూ అసహనం వ్యక్తం చేశారు. గుట్ట మీద కాల‌నీ క‌డ‌తాడ‌ట‌, తాత‌ముత్తాతల ఇండ్ల‌ను వ‌దిలి గుట్ట మీదికి పోవాల‌ట‌ అంటూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. దీని బ‌దులు క‌ర‌క‌ట్ట ఎత్తు పెంచితే సరిపోయేది క‌దా? అని పేర్కొన్న వైయస్ షర్మిల, నీ ఆలోచ‌న‌కు కాళేశ్వ‌రం బ‌లి అయిన‌ట్లు,భ‌ద్రాచ‌లం కూడా బ‌లి కావాలా? అంటూ కేసీఆర్ ను టార్గెట్ చేశారు.

బుర‌ద‌లోనే జ‌నం జీవ‌నం.. స‌ర్కారుకు సోయి లేదా? ఎమ్మెల్యేల‌కు బుద్ధి లేదా?

బుర‌ద‌లోనే జ‌నం జీవ‌నం.. స‌ర్కారుకు సోయి లేదా? ఎమ్మెల్యేల‌కు బుద్ధి లేదా?

ఇక ఇదే సమయంలో భారీ వ‌ర‌ద‌ల‌తో పేదల బతుకులు చిందరవందరగా మారినా... కూడు, గూడు లేక అల్లాడుతున్నా.. బుర‌ద‌లోనే జ‌నం జీవ‌నం గ‌డుపుతున్నా స‌ర్కారుకు సోయి లేదా? ఎమ్మెల్యేల‌కు బుద్ధి లేదా? అంటూ తీవ్ర స్థాయిలో వైయస్ షర్మిల మండిపడ్డారు. ఓట్ల కోసం జ‌నం కావాలి. వారికి ఆప‌దొస్తే మాత్రం ఆదుకోరా? అని సర్కార్ ను నిలదీశారు. రూ.10వేలు ఇస్తానన్న కేసీఆర్ నేటికీ పత్తా లేడు అంటూ వైఎస్ షర్మిల కేసీఆర్ ను తిట్టిపోశారు.

English summary
YS Sharmila questioned that KCR doesn't know that Bhadrachalam affects by floods because of Polavaram when he fed sweets to ap CM YS Jagan. YS Sharmila, who is touring flood-affected areas, made hot comments on Polavaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X