అవరోధాలు, ప్రతికూలతల మధ్య రాజకీయాల్లో వైఎస్ షర్మిల ప్రయాణం!!

తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పాలని, వైయస్సార్ పాలనను తెలంగాణ ప్రజలకు అందించాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని పెట్టి, పాదయాత్రలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన షర్మిల ఇప్పుడు కష్ట కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వంపై వైయస్ షర్మిల పోరాటం చేయడానికి వేస్తున్న అడుగులను అడుగడుగునా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇక క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో వైయస్ షర్మిలకు ఇబ్బందికరంగా తయారైంది.

తెలంగాణలో పార్టీ ప్రారంభించి ప్రజా సమస్యలను అర్థం చేసుకొని, ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి రంగంలోకి దిగిన వైయస్ షర్మిల పాదయాత్రతో ప్రజల్లో మంచి పేరును సంపాదించుకున్నారు. అయితే ఎక్కడికి వెళ్లినా వైయస్ షర్మిల అక్కడి ఎమ్మెల్యేలను, మంత్రులను టార్గెట్ చేసి వారి అవినీతిపై విమర్శలు చేయడంతో, వైయస్ షర్మిల ను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు రంగంలోకి దిగారు.

 yssharmila

నర్సంపేట లో పాదయాత్ర చేస్తున్న క్రమంలో వైయస్ షర్మిల ను అడ్డుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, వైయస్ షర్మిల బస్సును తగలబెట్టి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాత పోలీసులు షర్మిల ను అరెస్ట్ చేయడం, తదనంతరం జరిగిన పరిణామాలు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు వైయస్ షర్మిల ఏ చిన్న కార్యక్రమం చేసినా అడుగడుగున అడ్డుకునే పనిలో బీఆర్ఎస్ ఉంది.

దీంతో ఆమె రాజకీయంగా తాను అనుకున్నది చెయ్యలేక, పోలీసులు తీరుతో విసిగిపోయి చివరికి ఓ దశలో పోలీసుల పైన చేయి చేసుకునే దాకా పరిస్థితి వెళ్లింది. ఇదంతా పక్కన పెడితే వైయస్ షర్మిల పార్టీని బలోపేతం చేయలేకపోతున్నారు అన్నది రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చ. ఎన్నికలకు సమయం ఎంతో కాలం లేకపోవడంతో షర్మిల పార్టీలో అసలు ఉన్న బలమైన నాయకులు ఎవరు అన్నది కూడా చర్చనీయాంశమవుతోంది.

 yssharmila

షర్మిలను మినహాయిస్తే షర్మిల పార్టీలో చెప్పుకోదగ్గ నాయకులెవరూ లేకపోవడం ఆమెకు మైనస్ గా కనిపిస్తుంది. ఇక షర్మిలను నమ్మి పార్టీలో చేరిన ఖమ్మం జిల్లా నేతలు లక్కినేని సురేందర్ వంటి నాయకులు కూడా పార్టీకి రాజీనామా చేయడంతో, కొత్త నాయకులు రాకపోగా ఉన్న నాయకులను కాపాడుకోవడం షర్మిలకు పెనుభారంగా మారింది.

ఏది ఏమైనా తెలంగాణ రాజకీయాలలో వైయస్ షర్మిల ఒంటరి పోరాటం చేస్తూ ముందుకు సాగుతుంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ ప్రయాణంలో ఆమె ఏ మేరకు సక్సెస్ అవుతుంది? వచ్చే ఎన్నికలలో ఏ వ్యూహంతో ప్రజల్లోకి వెళుతుంది? అన్నది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+