YS Viveka Case:వివేకా హత్య వెనక కారణమేంటో చెప్పేసిన వైయస్ షర్మిల..!
మాజీ మంత్రి, ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల స్పందించారు. తన చిన్నాన్న హత్య ఆస్తి కోసం జరగలేదని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
వివేకానంద రెడ్డిపై ఉన్న ఆస్తులన్నీ, ఆయన ఎప్పుడో సునీత పేరు మీద వీలునామా రాశారని వైయస్ షర్మిల పేర్కొన్నారు. ఆస్తుల కోసం వివేకానంద రెడ్డిని హత్య చేశారని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. సునీత పేరు మీద ఆస్తులన్నీ ఉంటే, వేరే వారికి రాస్తారు అనడంలో అర్థం లేదని వైయస్ షర్మిల పేర్కొన్నారు.
ఆస్తుల కోసమే వివేకానంద రెడ్డిని అల్లుడు రాజశేఖర్ రెడ్డి హత్య చేశారు అనుకుంటే, అలాంటప్పుడు చంపాల్సింది వైయస్ వివేకానంద రెడ్డిని కాదు సునీతను అంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి ప్రజల మనిషి అని పేర్కొన్న షర్మిల తన చిన్నాన్న ఎలాంటివారో, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో పులివెందుల, కడప జిల్లా ప్రజలకు తెలుసన్నారు. వివేకానందరెడ్డి చాలా సాధారణ జీవితం గడపారన్నారు.

కొన్ని మీడియా సంస్థలు ఆయన వ్యక్తిగత జీవితం గురించి తక్కువ చేసి మాట్లాడుతున్నారు అని వైయస్ షర్మిల మండిపడ్డారు. తన చిన్నాన్న వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు, అర్హత ఎవరికీ లేదని ఆమె పేర్కొన్నారు. ఆయనపై చేసిన తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని వైయస్ షర్మిల వెల్లడించారు. వివేకానంద రెడ్డి హత్య ఆస్తి కోసం జరిగింది కాదని వైయస్ షర్మిల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే వివేకా హత్య కేసులో సిబిఐకి సునీత మొదట ఇచ్చిన వాంగ్మూలంపై అనుమానాలు ఉన్నాయని కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. సీబీఐ ఒక్క కోణంలోనే దర్యాప్తు చేస్తుందని, హత్య కేసును ఛేదించడం కంటే తనను ఇరికించడం కోసమే సిబిఐ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
రెండేళ్లుగా తాను ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదని అందుకే ఇలా జరిగిందంటూ వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి రాసిన లేఖ, సెల్ ఫోన్ సాయంత్రం వరకు దాచిపెట్టారని ఆ కోణంలో వారిని ఎందుకు ప్రశ్నించలేదో .. ఎందుకు దర్యాప్తు చేయలేదో తెలియదన్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications