వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణాలో వారిని ఎందుకు ఆదుకోరు.. సొంతరాష్ట్రంలోవాళ్ళు అల్లం, బయటివాళ్ళు బెల్లమా కేసీఆర్: వైఎస్ షర్మిల

|
Google Oneindia TeluguNews

తెలంగాణ సీఎం కేసీఆర్ పై, కెసిఆర్ ప్రభుత్వ తీరుపై వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టిన నాటి నుండి సీఎం కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్న షర్మిల రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. రైతు సమస్యలపై, నిరుద్యోగ సమస్యలపై వైఎస్ షర్మిల కేసీఆర్ తీరును ప్రశ్నిస్తూ ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నారు. ఈ క్రమంలో తాజాగామరోమారు సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్ షర్మిల.

కేసీఆర్ జార్ఖండ్ పర్యటనపై షర్మిల ఫైర్

కేసీఆర్ జార్ఖండ్ పర్యటనపై షర్మిల ఫైర్


ఇతర రాష్ట్రాలలో ఉన్న వారిపై అభిమానం ఒలకబోసే కెసిఆర్, సొంత రాష్ట్రంలో ఉన్న ప్రజల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ పర్యటన పై తెలంగాణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గాల్వన్ లోయలో వీరమరణం పొందిన సైనిక కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం తప్పు కాదు కానీ, తెలంగాణలో అమరుల కుటుంబాలకు ఎందుకు సహాయం చేయరు కెసిఆర్ అంటూ ప్రశ్నించారు.

తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు సాయం ఎందుకు చేయరు?

తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు సాయం ఎందుకు చేయరు?

శుక్రవారం జార్ఖండ్ కు వెళ్లి గాల్వాన్ లోయలో వీర మరణం పొందిన సైనిక కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సహాయం చేసిన నేపథ్యంలో వైయస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. గాల్వన్ లో అమరులైన సైనిక కుటుంబాలకు రూ.10లక్షలు ఇవ్వడం తప్పు కాదు. ఢిల్లీలో చనిపోయిన రైతులకు పరిహారం అందించడంలో తప్పు లేదు. కానీతెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలకు సాయం ఎందుకు చేయరు? అంటూ నిలదీశారు వైయస్ షర్మిల. 1200 మంది అమరులని ఉద్యమంలో గొంతుచించుకున్న మీకు అధికారంలోకి వచ్చాక కొందరే అమరులెందుకయ్యారు అంటూ ప్రశ్నించారు.

తెలంగాణాలో నిరుద్యోగులు, రైతుల కుటుంబాలను ఎందుకు ఆదుకోరు

తెలంగాణాలో నిరుద్యోగులు, రైతుల కుటుంబాలను ఎందుకు ఆదుకోరు


నోటిఫికేషన్ల కోసం ఆత్మహత్యలు చేసుకొంటున్న వందల మంది నిరుద్యోగులను ఎందుకు ఆదుకోరు? కెసిఆర్ అంటూ వైయస్ షర్మిల ప్రశ్నాస్త్రాలను సంధించారు. అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న వేలమంది రైతు కుటుంబాలను ఎందుకు ఆదుకోరు? అని ప్రశ్నించారు. కనీసం నష్టపోయిన పంటకు పరిహారం ఎందుకివ్వరు? సొంత రాష్ట్రం వారిని అల్లం,బయటి వారిని బెల్లం చేసుకోవడమేనా బంగారు భారత్ కు బాట అంటూ వైయస్ షర్మిల సీఎం కేసీఆర్ తీరును ఎండగట్టారు.

రాష్ట్రంలో ఉన్నవారు అల్లం, బయటవారు బెల్లమా కేసీఆర్

రాష్ట్రంలో ఉన్నవారు అల్లం, బయటవారు బెల్లమా కేసీఆర్


సొంత రాష్ట్రంలో ఉన్న వారి సమస్యలు తీర్చడం లేదని, నిరుద్యోగులను ఆదుకో వడం లేదని, ఆత్మహత్యలకు పాల్పడిన నిరుద్యోగుల కుటుంబాలకు బాసటగా లేరని మండిపడ్డారు. వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం కేసీఆర్ వారిని ఆదుకున్న దాఖలాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అమరవీరులు, రైతులు, నిరుద్యోగులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా వారిని ఆదుకోవడానికి చెయ్యరాని కెసిఆర్ పక్క రాష్ట్రంలో నెంబర్ వీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నారంటూ వైయస్ షర్మిల సీఎం కేసీఆర్ తీరును తూర్పారబట్టారు. రాష్ట్రంలో ఉన్న వారిని అల్లంలా, బయటి వారిని బెల్లంలా చూస్తున్నారంటూ వైయస్ షర్మిల మండిపడ్డారు.

English summary
YS Sharmila was incensed over the visit of CM KCR Jharkhand. YS Sharmila asked KCR directly why they do not support the families of martyrs, the families of the unemployed and the families of farmers who are committing suicide in Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X