వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగారు తెలంగాణ అంటే అమ్ముకుతినుడు,అందినకాడికి దోచుకునుడే కదా కేసీఆర్: వైఎస్ షర్మిల చురకలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ నగరంలో ఉన్న రాజీవ్ స్వగృహ పథకంలో భాగంగా నిర్మించిన ఇళ్ల పై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హెచ్ఎండీఏ కీలక ప్రకటన చేసింది. రాజీవ్ స్వగృహ ఇళ్ల వేలానికి సంబంధించి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపధ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం కేసీఆర్ పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కల నెరవేర్చటం కోసం ఏ మాత్రం ప్రయత్నం చేయడం లేదని ఆమె విమర్శించారు.

రాజీవ్ స్వగృహ ఇళ్ళ వేలంపై కేసీఆర్ ను టార్గెట్ చేసిన షర్మిల


సోషల్ మీడియాలో నిత్యం కేసీఆర్ పై విరుచుకు పడుతున్న వైఎస్ షర్మిల తాజాగా రాజీవ్ స్వగృహ ఇళ్ల విక్రయాలపై సీఎం కెసిఆర్ ను టార్గెట్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. రియల్ ఎస్టేట్ దోపిడీ నుంచి పేద మధ్యతరగతి ప్రజలను కాపాడి, వారి సొంతింటి కలను నెరవేర్చాలని సంకల్పించి, మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకే ఇండ్లను అందివ్వాలని రాజీవ్ స్వగృహను రాజశేఖర రెడ్డి గారు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.కానీ సీఎం కేసీఆర్ వాటిని అమ్ముకుంటున్నాడు అని మండిపడ్డారు.

రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలానికి పెట్టి జేబులు నింపుకుంటున్నారు


పేద మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చడం కోసం వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ పథకాన్ని ఏర్పాటు చేస్తే దొరగారేమో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించుడు పక్కన పెట్టి, మధ్యతరగతి బతుకులు ఎప్పుడు ఇళ్ళు లేకుండానే ఉండాలని, కమీషన్ల కోసం, ఖజానా నింపుతున్నామన్న వంకతో తన మిత్రబృందానికి, రియల్ ఎస్టేట్ భజన బ్యాచ్ కు టవర్ల లెక్కన రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలానికి పెట్టి జేబులు నింపుకుంటున్నారు అంటూ మండిపడ్డారు. కెసిఆర్ గారి బంగారు తెలంగాణ అంటే అమ్మకు తినుడు అందినకాడికి దోచుకునుడే కదా అంటూ వైయస్ షర్మిల తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు.

రాజీవ్ స్వగృహ ఇళ్ళకు సంబంధించిన వేలానికి హెచ్ఎండీఏ నోటిఫికేషన్

రాజీవ్ స్వగృహ ఇళ్ళకు సంబంధించిన వేలానికి హెచ్ఎండీఏ నోటిఫికేషన్

ఇదిలా ఉంటే రాజీవ్ స్వగృహ ఇళ్ళకు సంబంధించిన వేలానికి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదలలో భాగంగా బండ్లగూడ, నాగోల్ లోని సహ భావన టౌన్షిప్ పదిహేను టవర్లలోని మొత్తం 2246 ఇళ్ళు అమ్మకానికి ఉన్నాయని, వీటిని ఆన్లైన్లో వేలం వేయనున్నామని, డిస్కౌంట్ ధరకే రాజీవ్ స్వగృహ ఇల్లు అమ్మకం చేయనున్నట్లు వెల్లడించింది.వీటిలో చదరపు గజం కనీస ధర 2200 రూపాయలు నుంచి 2700 గా నిర్ణయించారు.

22వ తేదీ నుంచి వేలంలో పాల్గొనటం కోసం రిజిస్ట్రేషన్, 24 న ఆన్ లైన్ వేలం

22వ తేదీ నుంచి వేలంలో పాల్గొనటం కోసం రిజిస్ట్రేషన్, 24 న ఆన్ లైన్ వేలం


ఆసక్తి ఉన్నవారు మార్చి 22వ తేదీ నుంచి వేలంలో పాల్గొనటం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని, మార్చి 24 వ తేదీన ఇళ్ల వేలం ఆన్లైన్లో నిర్వహిస్తామని వెల్లడించింది. అయితే హైదరాబాద్ లో ఇళ్ల వేలంపాటలో పాల్గొనేవారు రిజిస్ట్రేషన్ ఫీజు కాకుండా 11800 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఇక హైదరాబాద్ లోనే కాకుండా ఖమ్మం జిల్లా పోలేపల్లిలో టౌన్షిప్ 8వ టవర్ లో 576 ఇళ్ళు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఖమ్మం జిల్లాలో జలజ టౌన్షిప్ లవ్ చదరపు గజం 1500 నుంచి 2000 వరకు నిర్ణయించారు. ఈ అవకాశాన్ని ఇళ్ళులేని వారు సద్వినియోగం చేసుకోవాలని సూచనలు చేశారు.

English summary
Sharmila has targeted KCR over Rajiv swagruha auction, was incensed that CM KCR was auctioning off the houses to his people for commissions .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X