ఖబడ్దార్ కేసీఆర్ ... గజదొంగ నువ్వే .. వైఎస్సార్ మహానేత నీలాగా కాదు : వైఎస్ షర్మిల వార్నింగ్

తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీతో రాజకీయ ప్రభంజనం సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నదివంగత సీఎం వైయస్ రాజశేఖరరెడ్డి తనయ వైయస్ షర్మిలా రెడ్డి సీఎం కేసీఆర్ తో సహా టిఆర్ఎస్ పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి సీఎం కెసిఆర్ సహా, టిఆర్ఎస్ నేతలు కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు షర్మిల.

వైయస్ రాజశేఖర్ రెడ్డిని కించ పరిస్తే ఊరుకునే స్థితిలో ప్రజలు లేరు

వైయస్ రాజశేఖర్ రెడ్డిని కించ పరిస్తే ఊరుకునే స్థితిలో ప్రజలు లేరు

వైఎస్సార్ గురించి మాట్లాడే అర్హత వారికి లేదని స్పష్టం చేశారు. తెలుగు ప్రజలందరికీ వైయస్సార్ గొప్పతనం తెలుసని, ప్రజలు వైయస్ రాజశేఖర్ రెడ్డిని కించ పరిస్తే ఊరుకునే స్థితిలో లేరని వైయస్ షర్మిల పేర్కొన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ సృష్టికర్త అని, అది మంచి పథకం కాబట్టే టిఆర్ఎస్ ప్రభుత్వం తొలగించకుండా కొనసాగిస్తుందని షర్మిల పేర్కొన్నారు. వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన మంచి పథకాన్ని తొలగించే ధైర్యం మీకు లేదు. వైయస్సార్ గురించి మాట్లాడే స్థాయి, స్తోమత, స్టాండింగ్ కూడా మీకు లేదు అంటూ విరుచుకుపడ్డారు.

వైయస్సార్ మహానేత మనసున్న నేత

వైయస్సార్ మహానేత మనసున్న నేత

ఖబర్దార్ కేసీఆర్ అంటూ నిప్పులు చెరిగారు. వైయస్సార్ మహానేత మనసున్న నేత అని నీలాగా కాదని విమర్శించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి నిజమైన ప్రజల నేత అని పేర్కొన్న షర్మిల వైయస్సార్ ని కించపరిస్తే లక్షల్లో ఉన్న ఆయన అభిమానులు ఊరుకోరని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు తిరగబడే రోజు వస్తుందని టిఆర్ఎస్ నేతలకు, కెసిఆర్ కు హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ గా కెసిఆర్ మార్చారని మండిపడ్డారు.

కేసీఆర్ అప్పుల తెలంగాణాగా మార్చి రాష్ట్రాన్ని దోపిడీ చేశారు

కేసీఆర్ అప్పుల తెలంగాణాగా మార్చి రాష్ట్రాన్ని దోపిడీ చేశారు

కెసిఆర్ తెలంగాణ బంగారు తెలంగాణ ఇస్తానని చెప్పి చివరకు రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. దోపిడీ చేసింది, గజ దొంగ లాగా మారింది కెసిఆర్ గారని ప్రజలు అర్థం చేసుకోలేనంత మూర్ఖులు కాదని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు వైయస్ షర్మిల. ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత డాక్టర్ వైయస్ఆర్ అని ఆమె కితాబిచ్చారు . ప్రజలు దేవుడితో సమానంగా కొలిచే నేత అంటూ పేర్కొన్నారు . మహానేతను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా సహించేదిలేదు. తెలంగాణలో ఉన్న లక్షలాది వైయస్ఆర్ అభిమానులు మీకు తిరుగుబాటుతో సమాధానం చెప్తారు. ఖబడ్దార్ అంటూ ఫైర్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+