తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక .. నేటి నుండి నామినేషన్లు .. మొదలైన పొలిటికల్ హీట్

|
Google Oneindia TeluguNews

తెలుగు రాష్ట్రాల్లో మరో ఉప ఎన్నికల నగారా మోగింది. రాజకీయ పార్టీలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తిరుపతి ఉప ఎన్నికకు ఎన్నికల కమీషన్ ముహూర్తం పెట్టింది . తిరుపతి ,నాగార్జునసాగర్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలన్నీ హడావుడి పడుతున్నాయి. ఇక నేటి నుంచి నాగార్జునసాగర్, తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈనెల 30వ తేదీ వరకు నామినేషన్లను వేయనున్నారు.

ఇక మార్చి 31వ తేదీన నామినేషన్లను పరిశీలించనున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ కొనసాగుతుంది.

ఏప్రిల్ 17వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మే రెండవ తేదీన కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఇదిలా ఉంటే ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దించేందుకు రెడీ చేస్తున్నాయి .

Tirupati Lok Sabha by-election created Political heat .. Nominations from today

ఇప్పటికే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు తెలుగుదేశం పార్టీ నుండి పనబాక లక్ష్మి ఎన్నికల బరిలోకి దిగనుండగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి డాక్టర్ గురుమూర్తి ఎన్నికల బరిలోకి దిగనున్నారు . ఇక బీజేపీ జనసేన పొత్తుల లో భాగంగా తిరుపతిలో బిజెపి నుండి అభ్యర్థిగా రత్నప్రభ లేదా శ్రీనివాసులు ఎన్నికల బరిలోకి దించాలన్న చర్చ జరుగుతుంది. మొత్తానికి ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తిరుపతి లోక్ సభ స్థానానికి ఉప ఎన్నికపై దృష్టిసారించారు. నేటి నుండి నామినేషన్లు కూడా కొనసాగనున్న కారణంగా ఏపీలో తిరుపతి వేదికగా పొలిటికల్ హీట్ మొదలైంది.

English summary
The nomination process for the Nagarjunasagar and Tirupati by-elections began today. Nominations will be accepted till the 30th of this month. Nominations will be scrutiny on March 31. The withdrawal of nominations will continue till April 3 after that. Elections will be held on April 17. The counting will take place on the second day of May and the results will be revealed. Meanwhile, all political parties are gearing up to field their candidates in the run-up to the election nominations process.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X