తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైకుంఠద్వార ద‌ర్శ‌నం : పోటెత్తిన భ‌క్త‌జ‌నం: త‌ర‌లి వ‌చ్చిన ప్ర‌ముఖులు

|
Google Oneindia TeluguNews

వైకుంఠ ద్వారా ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన ప్ర‌ముఖులు..సాధార‌ణ భ‌క్తుల‌తో తిరుమ‌ల కొండ కిట‌కిట‌లాడుతోంది. ము క్కోటి నాడు శ్రావారిని ద‌ర్శించుకొనేందుకు వ‌చ్చిన భ‌క్తుల‌ను అర్ధ‌రాత్రి నుండే క్యూ కాంప్లెక్స్‌ల్లోకి అనుమ‌తించారు. ఉద‌యానికే దాదాపు 40 మంది భ‌క్తులు క్యూ లో ఉన్నారు. అర్ద‌రాత్రి నుండి తిరుప్పావై పాశుర ప‌ఠ‌నం అరంభమైంది. ప‌లువురు రాజ‌కీయ‌..న్యాయ‌..ఆధ్యాత్మిక ప్ర‌ముఖులు తిరుమ‌లకి విచ్చేసారు.

వైకుంఠ ఏకాదశి..ద్వాద‌శి ప‌ర్వ‌దినాల్లో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు భారీగా తిరుమ‌ల కు త‌ర‌లి వ‌చ్చారు. వేల సంఖ్య‌లో భ‌క్తులు త‌ర‌లి రావ‌టంతో పాటుగా ప్ర‌ముఖులు సైతం తిరుమ‌ల‌కు విచ్చేసారు. సోమ‌వారం రాత్రి కే దాదాపు ల‌క్ష మంది క్యూలైన్ల‌లోకి చేరుకున్న‌ట్లు టిటిడి అధికారులు అంచ‌నా వేసారు. వైకుంఠ ద్వారా దర్శ‌నానికి విచ్చేసిన భ‌క్తుల కోసం ప్ర‌త్యేకంగా షెడ్లు ఏర్పాటు చేసారు. చ‌లి ఎక్కువ‌గా ఉండ‌ట‌తో భ‌క్తుల‌కు దుప్ప‌ట్లు సైతం పంపిణీ చేసారు. నారాయ‌ణ గిరి ఉద్యావ‌నంలో నిర్మించిన జ‌ర్మ‌న్ షెల్ట‌ర్లు, మాడ‌వీధి షెడ్ల‌లో భ‌క్తులకు వ‌స‌తులను క‌ల్పించారు. అన్న‌దాన సిబ్బంది, శ్రీవారి సేవ‌కులు భక్తుల‌కు సేవ‌లిందిస్తున్నారు.

Vaikunta dwara darshanam : Tirumala full with devotees..

అర్ధ‌రాత్రి నుండి సేవ‌లు ఆరంభం..

ముక్కోటి ఏకాద‌శి సంద‌ర్భంగా సోమవారం రాత్రి 11గంటలకే ఏకాంతసేవ నిర్వహించారు. అర్ధరాత్రి 12.05 గంటలకు ఆలయం తెరిచి తిరుప్పావై పాశుర పఠనం చేసారు. ఆ తర్వాత వైకుంఠద్వారం వద్ద రెండు వైపులా తలుపులు తెరుచుకోవ‌టంతో ద‌ర్శ‌నాలు మొద‌లయ్యాయి.. 1.45 గంటలకు వీఐపీలకు దర్శనం ప్రారంభించారు. మంగళవారం ఉదయం 5 గంటల్లోపే సర్వదర్శనం ప్రారంభించారు. అప్పటి నుంచి మొద‌లైన ద‌ర్శ‌నం స్వామివారికి నివేదన సమయాలు మినహా బుధవారం అర్ధరాత్రి వరకు నిర్విరామంగా సర్వదర్శనం కొనసాగనుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం ఉదయం 9-11 గంటల మధ్య స్వర్ణరథోత్సవం, బుధవారం ఉదయం 5-6గంటల మధ్య చక్రస్నానం ఘనంగా నిర్వహించనున్నారు. ఆ సమయంలో పుష్కరిణిలో స్నానమాచరించడం ద్వారా తిరుమలగిరుల్లో వెలసిన 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందనే న‌మ్మ‌కం భ‌క్తుల్లో నెల‌కొంది.

తిరుమ‌ల లో ప‌లువురు ప్రముఖులు..
వైకుంఠ ఏకాదశి దర్శనానికి పలువురు ప్రముఖులు తిరుమలకు తరలివచ్చారు. వీరికి వసతి, దర్శనాల విషయంలో పక్కా ప్రణాళికలు సిద్ధం సిద్ధం చేశారు. కర్ణాటక సీఎం కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడ, ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, సుప్రీంకోర్టు జస్టి్‌సలు ఎన్వీ రమణ, ఇందుమల్హోత్రా, సంతానగౌండర్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు,ఎమ్మెల్యే హరీశ్‌రావు, రాష్ట్ర మంత్రులు చిన్నరాజప్ప, అయ్యన్నపాత్రుడు, పత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వామిని దర్శించుకున్నారు.

English summary
Tirumala full of devotees on ocassion of Vaikunta Ekadasi. VIP s and normal people visit Sri venkateswara early hours. TTD Arranged many Facilities for devotees.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X