డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి టీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ విడుదల

హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఆర్టీసీలో తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి ఆర్టీసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే తాత్కాలిక ప్రాతిపదికన కొంత మంది డ్రైవర్లు, కండకర్టర్లను అధికారులు నియమించినట్లు అధికారులు తెలిపారు.

ఈ విధంగా తాత్కాలికంగా ఎంపిక చేసిన డ్రైవర్లకు రూ. 1500, కండక్టర్లకు రూ. 1000 రోజువారీ వేతనంగా ఇస్తునట్లు వేతనంగా చెల్లిస్తోంది ఆర్టీసీ. మరికొంత మంది డ్రైవర్లు, కండక్టర్లు ఇతర సిబ్బంది నియామకానికి ఆర్టీసీ యాజమాన్యం కసరత్తులు ప్రారంభించింది.

TSRTC Releases notification for drivers and conductors

ఇది ఇలా ఉండగా, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మరో ఆర్మీసీ కార్మకుడు ఆత్మహత్యకు యత్నించాడు. వరంగల్ జిల్లా నర్సంపేట డిపో పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రవి అనే ఆర్టీసీ కార్మికుడు ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. అయితే, అతని దగ్గరే ఉన్న ఈర కార్మికులు హుటాహుటిన వచ్చి మంటలు ఆర్పేశారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆర్టీ.సీ కార్మికుల సమస్యలను

ఆర్టీసీ కార్మికులెవరూ కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ రాజకీయ పార్టీ నేతలు కోరుతున్నారు. తామంతా అండగా ఉంటామని ప్రతిపక్ష పార్టీల నేతలు అంటున్నారు. సమస్యకు ఆత్మహత్యలు పరిష్కారం కావని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తూ.. అతని కుటుంబానికి అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తన మొండి వైఖరిని వీడి.. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు. ఆర్టీసీ కార్మికుల ఆకలి బాధలు ముఖ్యమంత్రికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కేసీఆర్ అసమర్థ పాలనతో రాష్ట్రంలో ఎవరూ కూడా సంతోషంగా లేరని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కాగా, తాము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎప్పుడూ చెప్పలేదని, టీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో కూడా పేర్కొనలేదని రాష్ట్ర మంత్రులు, ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడం సరైన చర్య కాదని వారంటున్నారు. అయితే, ఆర్టీసీ కార్మికులు మాత్రం తమ డిమాండ్లు నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇది ఇలావుంటే, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఆర్టీసీ కార్మికులు సమ్మెను కొనసాగించాలని టీఎన్జీవో నాయకులు స్పష్టం చేశారు. సమ్మెకు దిగేముందు ఆర్టీసీ సంఘాలు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+