Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కృష్ణా నదిలో చిక్కుకున్న 200 లారీలు-ఇసుక తెచ్చేందుకు వెళ్లి-పడవల్లో డ్రైవర్లు బయటికి

ఏపీలోని కృష్ణాజిల్లాలో ఇసుక తవ్వకాలు లారీ డ్రైవర్ల పాలిట శాపంగా మారాయి. కృష్ణా జిల్లాలోని కంచికచర్ల వద్ద ఇసుక ర్యాంప్ లో ఇసుక తీసుకుని వచ్చేందుకు కృష్ణానదిలోకి వెళ్లిన లారీలు, వాటి డ్రైవర్లు వరద ప్రవాహం పెరగడంతో అక్కడే చిక్కుకుపోయారు. దీంతో వీరిని రక్షించేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కృష్ణా జిల్లా కంచికచర్ల వద్ద నున్న చెవిటికల్లు ఇసుక ర్యాంప్ లోకి నిన్న దాదాపు 200కు పైగా లారీలు వెళ్లాయి. వీటితో పాటే డ్రైవర్లు, క్లీనర్లు కూడా వెళ్లారు. కృష్ణానది వరద ఉధృతి ఉందని తెలిసీ ఇసుక కోసం వెళ్లిన వీరంతా ఊహించని వరద రావడంతో నీటిలో చిక్కుకుపోయారు. ఇప్పుడు అక్కడి నుంచి బయటపడే మార్గం కోసం వెతుకుతున్నారు. ప్రభుత్వం, అధికారులు తమను కాపాడాలని వేడుకుంటున్నారు. దీంతో రంగంలోకి దిగిన స్ధానిక మత్సకారులు నాటు పడవల సహాయం తో డ్రైవర్లను సురక్షితంగా ఒడ్డుకు తీసుకొస్తున్నారు. అయితే ఏ క్షణాన అయినా వరద ఉదృతి కి లారీలు కొట్టుకుపోతాయని లారీ యజమానులు, డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు.

200 lorries and its drivers, cleaners stranded in krishna river flood while bringing sand at vijayawada

కృష్ణానదిలో ఇసుక తీసుకురావడానికి వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన డ్రైవర్లు వరద ఉధృతిపై అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేని చెప్తున్నారు. ఈ రోజు మొత్తం ఇక్కడే ఉన్నామని నిర్వాహకులు వరద సంగతి చెప్పలేదని లారీ డ్రైవర్ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద ఉధృతి ఉంటుందని తెలిస్తే అక్కడికి వెళ్లే వాళ్లమే కాదంటున్నారు. చివరికి తమ లారీలు వదిలి నాటు పడవల్లో ప్రాణాలు రక్షించుకోవాల్సిన పరిస్ధితి వచ్చిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో డ్రైవర్లను రక్షించడం మాత్రమే సాధ్యమవుతుందని అధికారులు చెప్తున్నారు. లారీల సంగతి మాత్రం దేవుడెరుగు అన్నట్లుగా మారింది.

సాధారణంగా ఏదాది పొడవునా కంచికచర్ల వద్దనున్న చెవిటికల్లు ఇసుక ర్యాంపులో తవ్వకాలు జరుగుతూనే ఉంటాయి. కృష్ణానది వరద ఉధృతి సమయంలో మాత్రమే ఇక్కడ తవ్వకాలకు విరామం ఇస్తారు. అదీ ముందుగానే అధికారులకు సమాచారం ఉంటుంది కాబట్టి లారీలు వెళ్లకుండా అడ్డుకుంటారు. కానీ ఈసారి మాత్రం అధికారులు నిర్లక్ష్యంగా ఉండటంతో ఇబ్బందులు తలెత్తాయి. ఊహించని స్ధాయిలో వరద ప్రవాహం రావడం కూడా ప్రధాన కారణంగా చెప్తున్నారు. దీంతో లారీడ్రైవర్లును ఎలాగోలా బయటికి తెచ్చేందుకు మత్సకారుల సాయంతో శ్రమిస్తున్నారు.

Recommended Video

    Araku Valley మండల కేంద్రంలో వాహనదారుల అవస్థలు | Visakhapatnam

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+