ఉగ్రవాద దేశానికి చెందిన అమ్మాయిని పెళ్లాడిన బెజవాడ కుర్రాడు: ప్రేమించి మరీ: హిందూ సంప్రదాయంలో

విజయవాడ: ఉగ్రవాద దేశంగా గుర్తింపు పొందిన ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన యువతిని పెళ్లాడాడో విజయవాడకు చెందిన ఓ యువకుడు. ఆయన పేరు వివేకానంద రామన్. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. న్యూఢిల్లీలో నివాసం ఉంటున్నాడు. విజయవాడలో రైల్వే డీఎస్పీగా పని చేస్తోన్న అశోక్ కుమార్, లక్ష్మీ మహేశ్వరిల కుమారుడాయన. ఢిల్లీలో చదువుకునే రోజుల్లో.. తన క్లాస్‌మేట్ ఆఫ్ఘనిస్తాన్‌ అమ్మాయి ఫ్రోజ్ షిరీన్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. మూడేళ్ల పాటు వారిద్దరు ప్రేమించుకున్నారు.

విద్యాభ్యాసం ముగిసిన వెంటనే వివేకానంద రామన్‌కు గ్రేటర్ నోయిడాలోని ఓ మల్టీ నేషనల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరాడు. ఆ వెంటనే తన ప్రేమ వివాహాన్ని పెద్దలకు తెలియజేశారు. దీనికి అశోక్ కుమార్ కుటుంబం అంగీకరించడంతో పెళ్లి పీటలు ఎక్కారు. విజయవాడలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో వారు ఒక్కటయ్యారు. హిందూ సంప్రదాయం పద్ధతుల్లో వివేకానంద రామన్.. ఆ ఆఫ్ఘన్ అమ్మాయికి మూడుముళ్లు వేశారు. ఫ్రోజ్ షిరీన్ కూడా న్యూఢిల్లీలో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

 Andhra man ties knot with Afghanistan in Vijayawada

ఇప్పటిదాకా- రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువకులు.. వేర్వేరు దేశాల అమ్మాయిలను పెళ్లాడిన సందర్భాలు చాలా ఉన్ానయి. ఓ ఉగ్రవాద దేశం ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన యువతిని ఆంధ్రా అబ్బాయి మూడుముళ్ల బంధంతో ఒక్కటి కావడం మాత్రం ఇదే తొలిసారి. ఆఫ్ఘన్ అమ్మాయిని తమ ఇంటి కోడలిగా చేసుకోవడానికి అశోక్ కుమార్, లక్ష్మీ మహేశ్వరి దంపతులు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కుమారుడి ఇస్ట ప్రకారమే పెళ్లి జరిపించారు. తన ప్రేమను ఇంట్లో వారు అంగీకరించరని మొదట్లో అనుమానించానని, ఎలాంటి పట్టింపులు లేకుండా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఆనందంగా ఉందని రామన్ వ్యాఖ్యానించారు.

 Andhra man ties knot with Afghanistan in Vijayawada
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+