కరోనా కిట్ల రచ్చ .. కన్నానే కాదు సుజనా కూడా విజయసాయి రెడ్డిని దులిపేశారుగా...!!

ఏపీలో కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలుపై రచ్చ కొనసాగుతుంది . కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలు విషయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ప్రశ్నించినందుకు వైసీపీ ఎంపీ ఘాటుగా సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడిన విషయం తెలిసిందే .కరోనా టెస్టింగ్ కిట్ల వ్యవహారంలో వైసీపీ నేతలు కమిషన్లకు కక్కుర్తి పడ్డారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో స్పందించిన విజయసాయి బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ను, అలాగే సుజనా చౌదరీని టార్గెట్ చేశారు.

ఘాటు విమర్శలు చేసిన విజయసాయికి అంతే ఘాటు రిప్లై ఇచ్చిన సుజనా

ఘాటు విమర్శలు చేసిన విజయసాయికి అంతే ఘాటు రిప్లై ఇచ్చిన సుజనా

కన్నా లక్ష్మీ నారాయణ ఒక వ్యక్తి నుంచి రూ. 20 కోట్లు తీసుకున్నారని... దానికి బీజేపీ ఎంపీ సుజనా చౌదరి బ్రోకర్ గా వ్యవహరించారంటూ వైసీపీ రాజ్యసభ్య సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అంతే కాదు కన్నా లక్ష్మీనారాయణను ఉద్దేశించి మళ్లీ అడుగుతున్నా...కన్నా! మీరు సుజనాకు అమ్ముడుపోయారా? లేదా? టీజేపీ (టీడీపీ జాకాల్స్‌ పార్టీ) వారు కాకుండా బీజేపీ వారు నా మీద విమర్శలు చేస్తే సమాధానం ఇస్తా అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుజనా చౌదరి అదే స్థాయిలో విరుచుకుపడ్డారు.

కుక్కులు మీపై మళ్లీ మొరుగుతున్నాయని మిత్రులు చెప్పారన్న బీజేపీ ఎంపీ

కుక్కులు మీపై మళ్లీ మొరుగుతున్నాయని మిత్రులు చెప్పారన్న బీజేపీ ఎంపీ


నిన్న తన మిత్రులు తనకు ఫోన్ చేసి కుక్కులు మీపై మళ్లీ మొరుగుతున్నాయని చెప్పారని సుజనా అన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయిని కుక్కతో పోలుస్తూ ఆయన ఇన్ డైరెక్ట్ గా వ్యాఖ్యానించారు . ఇక విజయసాయి చేసిన వ్యాఖ్యల విషయంలో ఏం జరిగిందోనని ఆరా తీస్తే కన్నా గారిపై, తనపై విజయసాయి నోటికి వచ్చింది వాగాడని, అనవసరపు విషయాలు మాట్లాడాడని తెలిసిందని మండిపడ్డారు. ఇలాంటి నేలబారు జీవుల మొరుగుడుని తాను పట్టించుకోనని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి చెప్పారు. కరోనా కిట్ల కమిషన్లను దండుకోవడానికి కాకుండా, కరోనాను తరిమేయడానికి మీ తెలివితేటలను ఉపయోగిస్తే బాగుంటుందని , అప్పుడు రాష్ట్రం బాగు పడేదని విజయసాయికి సుజనా చౌదరి హితవు పలికారు .

వైసీపీ నేతలపై , విజయసాయిపై బీజేపీ నేతల ఆగ్రహం

వైసీపీ నేతలపై , విజయసాయిపై బీజేపీ నేతల ఆగ్రహం

ఇక మరోవైపు అవినీతిని ప్రశ్నించినందుకే బీజేపీ నాయకులపై ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ నేత విష్ణువర్దన్‌రెడ్డి మండిపడ్డారు. సమస్యలను పక్కదోవ పట్టించేందుకే విజయసాయిరెడ్డి ఈ విధంగా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని తప్పుబట్టారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే కరోనా వ్యాప్తికి కారకులని, లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. హెల్త్‌ బులెటిన్ల విడుదలలో ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు . రాష్ట్రంలో ఐపీసీ కాస్తా జగన్ పాలనలో వైసీపీ పీనల్‌ కోడ్‌గా మారిపోయిందని విష్ణువర్దన్‌రెడ్డి మండిపడ్డారు . ఇక ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు బీజేపీ నాయకులు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+