చంద్రబాబుకు పవన్ దత్తపుత్రుడైతే.. వైసీపీ ఎమ్మెల్యేలు జగన్‌కు పెంపుడు కుక్కలా? బోండా ఉమా ఫైర్

ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై జగన్ సర్కారుకు గట్టి కౌంటరిచ్చిన టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో చాలా ఎమోషనల్ అయ్యారు. పవన్ కల్యాణ్ ను చంద్రబాబు దత్తపుత్రుడిగా వైసీపీ నేతలు పోల్చడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అంతకుమందు వైసీపీ ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. జనసేనాని పవన్.. చంద్రబాబుకు దత్తపుత్రుడిలా, చెప్పినట్లు ఆడుతారని, ప్యాకేజీలు తీసుకుని ఉద్యమాలు చేస్తారని విమర్శించారు.

ఆయన కొడుకైతే మీరు కుక్కలా?

ఆయన కొడుకైతే మీరు కుక్కలా?

పవన్ కల్యాణ్ ను మాటలనేంత కెపాసిటీగానీ, అర్హతగానీ, స్థాయిగానీ వైసీపీ నేతలకు లేనేలేదని బోండా ఉమ అన్నారు. ‘‘పవన్ చంద్రబాబు దత్తపుత్రుడైతే.. మరి వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు జగన్ కు పెంపుడు కుక్కలా?'' అని వివాదాస్పద ప్రశ్న వేశారు. వైసీపీలు ముమ్మాటికీ పెంపుడు కుక్కల్లాగా, పెయిడ్ ఆర్టిస్టుల్లాగా మీడియాముందుకొచ్చి నోటికొచ్చిందల్లా వాగుతున్నారని మండిపడ్డారు.

మీసం మెలేసి చెబుతున్నా..

మీసం మెలేసి చెబుతున్నా..

‘‘పవన్ ను నాయుడు అదీ అదీ అంటూ పిచ్చికూతులు కూస్తోన్న వైసీపీ నేతలకు ఒక విషయం చెప్పదల్చుకున్నా.. ఎస్.. పవన్ కల్యాణ్ నాయుడే.. ముమ్మాటికి నాయుడే.. పవన్ పాలకొల్లు నాయుడు. ఇది వాస్తవం. మీసం మీద చెయ్యేసి మరీ నేను చెబుతున్నా. వైసీపీ నేతలుగానీ, పవన్‌ను విమర్శించే ఇతరులుగానీ తమకు సంబంధించి ఏవైనా అనుమానాలుంటే వెంటనే డీఎన్ఏ టెస్టు చేయించుకోండి. పవన్‌పై సోషల్ మీడియాలో పిచ్చికూతలు ఆపండి''అని బోండా ఉమ ఫైరయ్యారు.

కొవ్వు కరిగే రోజులు దగ్గర్లోనే..

కొవ్వు కరిగే రోజులు దగ్గర్లోనే..

డబ్బులకు అమ్ముడుపోయి, పుట్టిన ప్రాంతానికి ద్రోహం చేస్తోన్న గుంటూరు, క్రిష్ణా జిల్లాల ఎమ్మెల్యేలు రాజధాని తరలింపును సమర్థించడం దారుణమని ఉమ అన్నారు. ఐదు కోట్ల మంది మెచ్చిన రాజధానిని సీఎం జగన్ చంపేస్తోంటే.. వేడుక చూస్తున్నారని మండిపడ్డారు.

రైతులే తరిమికొడతారని

రైతులే తరిమికొడతారని

భవిష్యత్తులో వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలెవరూ అమరావతిలో అడుగుపెట్టలేరని, కనీసం అసెంబ్లీ సమావేశాల్లో కూడా పాల్గొనకుండా రైతులే తరిమికొడతారని చెప్పారు. 150 సీట్ల మదంతో వైసీపీ నేతలకు కొవ్వు పట్టిందని, అది కరిగేరోజు దగ్గర్లోనే ఉందని బోండా ఉమ హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+