పోలీసుల కాళ్ళు పట్టుకున్న రైతులు .. మా బంద్ కు సహకరించాలని వేడుకోలు
Recommended Video
రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని ప్రాంత రైతులు నిన్న జరిగిన దాడికి నిరసనగా నేడు అమరావతి బంద్ నిర్వహిస్తున్నారు. అయితే రైతుల ఆందోళనలను భగ్నం చెయ్యటానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకోవటం హేయమని అటు ప్రతిపక్ష పార్టీల నాయకులు పోలీసుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. నేడు నిన్నటి దాడికి నిరసనగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఇక నేడు మందడంలో ఉదయం నుంచి బంద్ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే తుళ్లూరు డీఎస్పీ కాళ్లు పట్టుకున్నారు రైతులు. తమ బంద్‌కు సహకరించాలంటూ కోరుతూ పోలీసుల కాళ్లు పట్టుకున్న ఘటన స్థానిక ప్రజలను కన్నీరు పెట్టించింది . రాజధాని అమరావతి కోసం రైతుల ఆవేదన ఉద్యమంగా మారింది. సకల జనుల సమ్మె కొనసాగుతుంది. రాజధాని రైతులకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సంఘీభావ ర్యాలీలు కొనసాగుతున్నాయి.

మహిళలపై దౌర్జన్యానికి నిరసనగా ఉదయమే రహదారిపైకి వచ్చిన రైతులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు . తమ గ్రామం మీదుగా వెళ్లటానికి వీల్లేదని పోలీసు వాహనాలను అడ్డుకుని రైతులు వెనక్కి పంపిస్తున్నారు.దుకాణాలు తెరవనీయకుండా చూస్తున్నారు. రోడ్లపైకి వచ్చి రైతులు బంద్ పాటిస్తున్నారు. దీంతో.. అమరావతి ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు తమ షాపుల వద్ద కూర్చోవద్దని చెప్తున్నారు. తమ ప్రాంతం మీదుగా వెళ్లకూడదంటూ పోలీసు వాహనాలను వెనక్కి పంపించేస్తున్నారు రైతులు.ఈ సందర్భంగా.. పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. అంతేకాకుండా అమరావతికి మద్దతుగా పలు జిల్లాల్లో సంఘీభావ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications