విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ్యక్తిగత పనులు నేనా ... నిరూపిస్తే ఉరేసుకుంటా ... బాబుకు తోట త్రిమూర్తులు సవాల్

|
Google Oneindia TeluguNews

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు షాక్ ఇచ్చి వైసీపీ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు తోట త్రిమూర్తులు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కార్యకర్తలతో భేటీ అయ్యి భవిష్యత్తు ప్రణాళికపై చర్చించిన తోట త్రిమూర్తులు ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తనను చాలా బాధించాయి అని చెప్పుకొచ్చారు. అంతేకాదు తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడికి ఊహించని పంచ్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు.

 పవన్ టీడీపీతో లోపాయికారి ఒప్పందం ... ఫైర్ అయిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పవన్ టీడీపీతో లోపాయికారి ఒప్పందం ... ఫైర్ అయిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్

టీడీపీకి రాజీనామా చేసే సందర్భంలో కార్యకర్తలతో భేటీ అయిన తోట త్రిమూర్తులు ఇటీవల చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలు బాధించాయని పేర్కొన్నారు. కాకినాడలో ఇటీవల జరిగిన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తోట త్రిమూర్తులు పాల్గొనలేదు. స్వయంగా చంద్రబాబు ఆహ్వానించిన ప్పటికీ చంద్రబాబు సమీక్షా సమావేశానికి తోట త్రిమూర్తులు గైర్హాజరవ్వడంతో చంద్రబాబు ఆ సమావేశంలో తోట త్రిమూర్తులు ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. త్రిమూర్తులు పార్టీ మారనున్నట్లు , పార్టీకి రాజీనామా చేస్తారంటూ వచ్చిన వార్తల నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తోట త్రిమూర్తులు సవాల్ విసిరారు.

Recommended Video

Jr NTR Is The Only Saviour Of TDP Party In Future || మరోమారు TDP లోకి జూనియర్ ఎన్టీఆర్ అంశం
Thrimurthulu challenged Chandrababu to prove the allegations

ఇక చంద్రబాబు ఆ సమావేశంలో అనేక మంది పార్టీలోకి వచ్చి సొంతపనులు చేయించుకుని వెళ్లిపోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయకులు వెళ్లినా తెలుగుదేశం పార్టీ బలంగానే ఉందని కార్యకర్తలు తమతోనే ఉన్నారని చెప్పుకొచ్చారు. దీంతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల ఆవేదన వ్యక్తం చేసిన తోట త్రిమూర్తులు టిడిపిలో తన 17 సంవత్సరాల నుండి ఉన్నానని, చంద్రబాబు తాను ఒక వ్యక్తిగత పని చేయించుకున్నట్లు నిరూపించగలరా అని సవాల్ విసిరారు. తాను వ్యక్తిగత పనులు చేయించుకున్నట్లు నిరూపిస్తే కార్యకర్తల సమక్షంలోనే ఉరేసుకుంటానని స్పష్టం చేశారు. టీడీపీకి రాజీనామా చేసిన ఆయన ఈనెల 15న వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మొత్తానికి పార్టీ వీడి వెళుతున్న సీనియర్ నాయకుడు తోట త్రిమూర్తులు చంద్రబాబు నాయుడు కి సవాల్ చేసి వెళ్లడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

English summary
Challenging the remarks made by Chandrababu, Thrimurthulu challenged whether he had been in TDP in his 17 years and whether Chandrababu could prove that he had done a personal job. He made it clear that he would be commit suicide in the presence of activists if he proved himself to be doing personal work. He resigned from the TDP and announced that he will join the YCP on the 18th of this month
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X