పవన్ కళ్యాణ్ పై విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు
Recommended Video
పవన్ కళ్యాణ్ పై వైసిపి నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ చేతిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలుబొమ్మలా మారిపోయారని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.
తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్లు పెట్టిన విజయసాయి గతంలో టీడీపీ ఎన్ని అరాచకాలు చేసినా ఒక మౌన మునిలా ఉన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైసీపీ అధినేత సీఎం జగన్ చేస్తున్న మంచి పనులపై విరుచుకుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. . ఇప్పుడు టీడీపీ గేమ్ ప్లాన్ లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని లక్ష్యం చేసుకుని విమర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు . పవన్ చంద్రబాబు చేతిలోని మనిషి అన్న విషయం బహిరంగ రహస్యమే అని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇక అంతేకాదు ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు రాష్ట్రానికి వసూలయ్యే పన్నును ఆదా చేసేలా ఉన్నాయని, పారదర్శక పాలనతో దేశానికి ఆదర్శంగా ఆయన నిలవనున్నారని పేర్కొన్నారు. ఇక ఆయన నిర్ణయాలు ఒక మంచి దిశను చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో చౌకబారు ప్రచారం కోసం కాకుండా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఆలోచించాలని, ఏదైనా విమర్శలు చేసేటప్పుడు ముందూ, వెనుకా చూసి మాట్లాడాలి అని కూడా విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ఇటీవల పవన్ ను టార్గెట్ చేస్తూ సాగుతున్న విజయ సాయి ట్వీట్లు చూస్తే మొన్నటికి మొన్న అమరావతి సందర్శించిన సమయంలో పవన్ కళ్యాణ్ ను చంద్రబాబుకు అజ్ఞాత పార్ట్ నర్ అంటూ ఆయన పోస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications