• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ నియోజకవర్గంపై దృష్టి సారించిన సీఎం జగన్... ఎమ్మెల్యే అభ్యర్థి ఖరారు?

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి త‌న విశాఖ‌ప‌ట్నం ప‌ర్య‌ట‌న‌లో ఒక ఎమ్మెల్యే అభ్య‌ర్థిని కూడా ఖ‌రారు చేసిన‌ట్లు భావించ‌వ‌చ్చు. వైఎస్సార్ వాహ‌న‌మిత్ర నిధులు విడుద‌ల కార్య‌క్ర‌మం వైజాగ్‌లో జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఎక్కువ స‌మ‌యం కేటాయించి పార్టీకి సంబంధించిన అన్ని విష‌యాలు చ‌ర్చించారు.

విశాఖ తూర్పుపై దృష్టి సారించిన జగన్

విశాఖ తూర్పుపై దృష్టి సారించిన జగన్

తన తాజా పర్యటనలో ముఖ్యమంత్రి జగన్ విశాఖ‌ప్న‌టం తూర్పు నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టిసారించారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత రెండుసార్లు జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ ఇక్కడ ఓట‌మిపాలైంది. తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున వెల‌గ‌పూడి రామ‌కృష్ణ‌బాబు ఘ‌న‌విజ‌యం సాధిస్తూ వ‌స్తున్నారు. ఈసారి ఎన్నిక‌ల్లో ఎలాగైనా ఇక్క‌డ జెండా ఎగరవేయాలనే పట్టుదలతో ఉన్న జగన్ తూర్పు నియోజ‌క‌వ‌ర్గానికి పలు వ‌రాలు ప్ర‌క‌టించారు. మూడో ఫ్లై ఓవర్ నిర్మాణంతోపాటు మరికొన్ని పథకాలకు నిధుల విడుదలకు పచ్చజెండా ఊపారు. ప్ర‌స్తుతం ఇక్క‌డ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా గత ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైన విజ‌య‌నిర్మ‌ల ఉన్నారు. ప్రస్తుతం ఆమె vmrda చైర్మన్ గా కొనసాగుతున్నారు.

వెలగపూడిని ఓడించాలనే పట్టుదల

వెలగపూడిని ఓడించాలనే పట్టుదల

2019 ఎన్నిక‌ల్లో భీమిలీ నుంచి విశాఖ తూర్పుకు వ‌ల‌స వ‌చ్చిన ఆమె వెలగపూడికి గ‌ట్టి పోటీనిచ్చారు. టికెట్ ద‌క్క‌ని వంశీకృష్ణ యాదవ్ అనుచ‌రులు వైసీపీ కార్యాల‌యాన్ని ధ్వంసం చేయ‌డం రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. రాబోయే ఎన్నిక‌ల్లో టికెట్ కోసం విజ‌య‌నిర్మ‌ల‌తోపాటు ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచే విశాఖ మేయ‌ర్‌గా ఎన్నికైన హ‌రి వెంక‌ట‌కుమారితోపాటు ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాద‌వ్ కూడా పోటీలో నిలిచారు. అయితే ఇక్కడ సీటుకు సంబంధించి ఎటువంటి మార్పు ఉండదనే సంకేతాలు పంపించారని పార్టీవర్గాలు వెల్లడించాయి.

రాబోయే ఎన్నికల్లో విజయనిర్మలే అభ్యర్థి?

రాబోయే ఎన్నికల్లో విజయనిర్మలే అభ్యర్థి?

విజయనిర్మల చెప్పినవాటన్నింటికీ ముఖ్యమంత్రి అంగీకరించడంతో ఆమెకు ప్రజల్లోకి వెళ్లడానికి మరింత అవకాశం లభించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆమె చెప్పినవాటన్నింటినీ జగన్ అంగీకరించడాన్ని బట్టే ఆమె సీటు ఖాయమైందని అనుకోవచ్చని, ఇందులో ఎటువంటి సందేహానికి తావులేదని స్థానిక పార్టీ నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. దాదాపు అభ్యర్థి ఖరారయ్యారు కాబట్టి ప్రత్యర్థి పార్టీ తెలుగుదేశం పార్టీ నుంచి వెలగపూడి రామకృష్ణబాబే పోటీకి దిగుతారా? లేదంటే యాదవ సామాజికవర్గం నుంచి ఎవరినైనా బరిలోకి దింపుతారా? అనేది తెలియాలంటే కొద్దికాలం వేచి చూడక తప్పదు.

English summary
Chief Minister Jagan, who is determined to win the Visakhapatnam East constituency, has almost finalized the candidate there.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X