Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హతవిధి: జీలకర్ర బెల్లం పెట్టే సమయంలో పడిపోయిన వధువు, పెళ్లింట విషాదం..

పెళ్లి అంటే ఇద్దరు మనషుల మనసులు ఒక్కటి కావడమే. తనువులు వేరు అయిన.. హృదయం ఒక్కటి అవనుంది. ఈ రోజుల్లో పెళ్లి అంటే ప్రీ వెడ్డింగ్ షూట్.. సంగీత్, మెహందీ అంటూ తెగ హడావిడి చేస్తున్నారు. దీంతో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు స్ట్రెయిన్ కావడం సహజం. అవును అబ్బాయి.. పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు. క్షణం తీరిక లేకుండా గడుపుతారు. అమ్మాయి కూడా షాపింగ్, మేకప్.. ఇతర పనులతో బిజీగా ఉంటారు. దీంతో సమయానికి తినక.. నిద్ర పోకుండా అనారోగ్యం కొనితెచ్చుకుంటున్నారు. పెళ్లయిన తర్వాత అలా జరిగితే ప్రాబ్లం లేదు. అంటే ఆస్పత్రికి వెళ్లి చూపించుకొవచ్చు. మరీ పీటల మీద జరిగితేనే.. రెండు కుటుంబాలు, బంధువులకు తీరని శోకం మిగులుతుంది. అలాంటి ఘటన నిన్న విశాఖపట్టణంలో జరిగింది.

జీలకర్ర బెల్లం పెట్టగా.. కుప్పకూలిన వధువు

జీలకర్ర బెల్లం పెట్టగా.. కుప్పకూలిన వధువు

విశాఖ మధురవాడలో నిన్న రాత్రి 7 గంటలకు తెలుగు యువత అధ్యక్షుడు శివాజీ-సృజన పెళ్లి జరగాల్సి ఉంది. ముహూర్తం సమయానికే అన్నీ ఏర్పాట్లు చేశారు. ఇంకేముంది అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. వరుడు.. వధువు ఇద్దరూ పెళ్లి పీటలెక్కారు. కల్యాణం తంతు జరుగుతుంది. కీలక ఘట్టం అయిన జీలకర్ర బెల్లం ప్రక్రియ మొదలవనుంది. వధువు తలపై జీలకర్ర బెల్లం పెడుతుండగా సృహ కోల్పోయింది. పీటలపైనుంచి కింద పడిపోవడంతో అంతా కంగారు పడిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

వధువు మృత్యువాత

వధువు మృత్యువాత

వధువు సృజన ప్రాణాలు కోల్పోయింది. దీంతో పెళ్లింట ఒక్కసారిగా విషాదం నెలకొంది. క్షణ కాలంలో పెళ్లి ప్రక్రయి ముగిసేది. కానీ ఆమెకు ఎందుకు అలా తెలియరాలేదు. కానీ వధువుకు గుండెపోటు వచ్చిందని సమాచారం. అలసిపోవడం వల్లే ఇలా జరిగి ఉంటుందని తెలుస్తోంది. కానీ దీనిని వైద్యులు గానీ, ఇటు కుటుంబ సభ్యులు కానీ నిర్ధారించలేదు. కానీ సృజన తిరిగికానీ లోకాలకు వెళ్లడంతో అంతా నిశ్శబ్దం వాతావరణం నెలకొని ఉంది.

ఒత్తిడి, నిద్ర వల్లే..?

ఒత్తిడి, నిద్ర వల్లే..?


ఇటీవల ఏపీలో ఓ విద్యార్థి కూడా హార్ట్ స్ట్రోక్‌కు గురయ్యాడు. ఈ మధ్య గుండెపోటు అనేది.. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా వస్తోంది. స్ట్రెస్, ఆహారం తీసుకోవడం.. నిద్ర ఇంపార్టెంట్.. దీనిపై వైద్యులు పదే పదే సూచన చేస్తున్నారు. అయినప్పటికీ కొందరు పెడచెవిన పెడుతున్నారు. అలా చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వధువు విషయంలో గుండెపోటో కాదో తెలియరాలేదు. కానీ ఒత్తిడికి గురవడం వల్ల స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఆమె మృతితో అక్కడ విషాద వదనం నెలకొంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+