యువతి, ప్రియుడు, భార్య.. ట్రయాంగిల్ లవ్‌స్టోరీలో ట్విస్ట్, యువతి సూసైడ్.. ప్రియుడు..?

లోకం తీరో.. సమాజం పోకడో తెలియదు కానీ కొందరు తీరు ఇబ్బంది కలిగిస్తోంది. వివాహిత మహిళలే కాదు పురుషులతో కూడా సంబంధాలు కొనసాగిస్తున్నారు. జరుగుతున్న ఘటనల నేపథ్యంలో తీరు మార్చుకోవాలని సూచించినా..ఫలితం లేకుండా పోతోంది. రోజుకో ఘటన వెలుగుచూస్తూనే ఉంది. ఇటీవల విశాఖలో వివాహేతర సంబంధం వెలుగుచూసింది. తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తే యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు కూడా సూసైడ్ అటెంప్ట్ చేశాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

భార్య ఉండగా కూడా..

భార్య ఉండగా కూడా..

విశాఖ జిల్లా లువ్వాసింగి పంచాయతీ సంగులోయ గ్రామంలో విలియంకుమార్ ఉంటున్నారు. ఇతనికి భార్య ఉంది. కానీ మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. గిరిజన బాలిక లక్ష్మీతో అక్రమ బంధం కొనసాగుతోంది. ఈ విషయం తెలిసిన విలియం భార్య ఆగ్రహానికి గురైంది. వారిద్దరిని పలుమార్లు హెచ్చరించింది. తీరు మార్చుకోవాలని తేల్చిచెప్పింది.

 మారని తీరు

మారని తీరు

కానీ విలియం, లక్ష్మీ వైఖరి ఎంతమాత్రం మారలేదు. దీంతో విసిగివేశారిన విలియం భార్య.. ఇటీవల లక్ష్మీని బెదిరించింది. తీరు మార్చుకోవాలని హెచ్చరించింది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. దీంతో లక్ష్మీ భయపడిపోయింది. తన ప్రియుడు లేని జీవితం వద్దనుకొంది. ఆత్మహత్య చేసుకుంది. ఆమె చనిపోయిందని తెలిసి విలియం కూడా మదనపడిపోయాడు.

సూసైడ్ అటెంప్ట్

సూసైడ్ అటెంప్ట్

లక్ష్మీ లేని జీవితం వద్దనుకొన్నాడు. ఆయన కూడా ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. అయితే వెంటనే అతనిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పాడేరు జిల్లా స్థాయి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే స్పందించడంతో విలియంకు ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. వివాహేతర సంబంధం మానుకోవాలని అని చెప్పినందుకు లక్ష్మీ ఆత్మహత్య చేసుకోగా.. విలియం కూడా ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించాడు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

ఫిర్యాదు చేయలే..

ఫిర్యాదు చేయలే..

సంగులోయలో జరిగిన ఘటనలపై తమకు సమాచారం లేదని పోలీసులు చెప్తున్నారు. లక్ష్మీ ఆత్మహత్య, విలియం సూసైడ్ అటెంప్ట్‌కు సంబంధించి తమకు ఫిర్యాదు చేయలేరని ఎస్ఐ రామరావు పేర్కొన్నారు. అందుకే ఈ కేసుకు సంబంధించి కేసు నమోదు చేయలేదని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+