93ఏళ్ల వయస్సులోనూ బోధన- విజయనగరంలో అరుదైన మహిళా ప్రొఫెసర్-చదివితీరాల్సిన పాఠం..
రోజుకు 60 కిలోమీటర్ల ప్రయాణం.. చెప్పేది ఫిజిక్స్ పాఠాలు.. అదీ 93 ఏళ్ల ముదిమి వయస్సులో. పేరు ప్రొఫెసర్ చిలుకూరి శాంతమ్మ.భౌతిక శాస్త్రంపై తనకున్న మక్కువతో టీచర్ గా మారిన ఈ మహిళా టీచర్.. 93 ఏళ్ల వయస్సులోనూ తన వృత్తిని ఎంతో నిబద్ధతతో నిర్వహిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
వయోవృద్ధులు,
సంబంధిత
ఆరోగ్య
సమస్యలు
ఈ
93
ఏళ్ల
ప్రొఫెసర్
లో
ఉన్న
బోధనా
స్ఫూర్తిని
తగ్గించలేకపోయాయి.
భౌతిక
శాస్త్ర
ప్రపంచంలోని
విద్యార్ధుల్ని
తీసుకెళ్లేందుకు
ఆమె
ప్రతిరోజూ
60
కిలోమీటర్లు
ప్రయాణించి
విజయనగరం
నుంచి
విశాఖ
చేరుకుంటున్నారు.
వయసు
మీదపడుతున్నా,
మోకాలి
శస్త్రచికిత్స
నొప్పులు
వేధిస్తున్నా..
లెక్కచేయకుండా
ఈ
మహిళా
అధ్యాపకురాలు
ప్రదర్శిస్తున్న
తెగువ..
రేపటి
తరం
విద్యార్ధులకు
స్ఫూర్తిగా
నిలుస్తోంది.
ఏడు
దశాబ్దాలుగా
ఫిజిక్స్
బోధిస్తూ
యువతకు
తినిస్తోంది.
వయస్సుతో
తనకు
పనిలేదు.
తన
తల్లి
వనజాక్షమ్మ
కూడా
104
ఏళ్లు
జీవించిందని
ఆమె
చెబుతారు.
ఆరోగ్యం
మన
మనస్సులో,
సంపద
మన
హృదయాల్లో
ఉందనేది
ఆమె
అభిప్రాయం.
కాబట్టి
ఎలప్పుడూ
మనసు,
హృదయాన్ని
ఆరోగ్యంగా
ఉంచుకోవాలని
చెబుతారు.
తన
చివరి
శ్వాస
వరకూ
బోధించేందుకు
సిద్ధమని
ఆమె
చెబుతుంటారు.
ప్రొఫెసర్ శాంతమ్మ క్రమశిక్షణ, అంకితభావం, ఆమె సహచరులను, విద్యార్ధులను విస్మయానికి గురిచేస్తోంది. ప్రొఫెసర్ శాంతమ్మ క్లాస్‌ని మిస్ అవ్వడం తమకెప్పుడూ ఇష్టం ఉండదని విద్యార్ధులు చెబుతారు.తామెప్పుడూ ఆమె క్లాస్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తామని వారు చెప్తుంటారు.క్లాస్‌కి ఆమె ఎప్పుడూ ఆలస్యం చేయదని, క్రమశిక్షణ, అంకితభావం, నిబద్ధతలో ఆమె తమకు రోల్ మోడల్ అంటుంటారు. ఆమె ఓ వాకింగ్ అండ్ టాకింగ్ ఎన్‌సైక్లోపీడియా అని కూడా విద్యార్ధులు గర్వంగా చెప్పుకుంటారు. బోధన ఒక్కటే కాదు ఆమె పరోపకారి కూడా. తన ఇంటిని వివేకానంద మెడికల్ ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చి ఇప్పుడు అద్దెకు ఉంటున్నారు శాంతమ్మ.. 1929 మార్చి 8న మచిలీపట్నంలో జన్మించిన శాంతమ్మ ఐదు నెలల వయసులో తండ్రిని కోల్పోయింది. ఆమె తండ్రి తరపు మేనమామ వద్ద పెరిగారు. 1945లో, ఆమె మహారాజా విక్రమ్ దేవ్ వర్మ నుండి భౌతికశాస్త్రంలో బంగారు పతకాన్ని అందుకుంది. ఆమె అప్పుడు మద్రాసు రాష్ట్రంలోని విశాఖపట్నంలోని ఏవీఎన్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థిని.

ప్రస్తుతం రోజుకు కనీసం 6 క్లాసులు తీసుకుంటానని శాంతమ్మ గర్వంగా చెప్తారు. ఆమె ఫిజిక్స్ చదవాలనే తన అభిరుచి కారణంగా అందులో బీఎస్సీ ఆనర్స్ చదివారు. ఆంధ్రా యూనివర్సిటీ నుండి మైక్రోవేవ్ స్పెక్ట్రోస్కోపీలో డీఎస్సీ (Ph.D కి సమానం) పూర్తి చేసి, ఆ తర్వాత 1956లో ఆంధ్రా యూనివర్సిటీలోని కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో ఫిజిక్స్ లెక్చరర్‌గా చేరారు. లెక్చరర్ నుండి ప్రొఫెసర్, ఇన్వెస్టిగేటర్ మరియు రీడర్ వరకు, ప్రొఫెసర్ శాంతమ్మ అన్నింటినీ చేసారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR), యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) మరియు డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST) వంటి వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలలో ఆమె పరిశోధనాత్మక ఇన్‌ఛార్జ్‌గా కూడా పనిచేశారు. ప్రొఫెసర్ శాంతమ్మ 1989లో 60 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేశారు. అయితే పదవీ విరమణ అనేది ఆమెకు ఓ పదం మాత్రమే. పరిశోధనలపై దృష్టి పెట్టి మళ్లీ ఆంధ్రా యూనివర్సిటీలో గౌరవ అధ్యాపకురాలిగా చేరి ఆరేళ్లు పని చేశారు.
ఆమె దినచర్య ఉదయం 4 గంటలకు మొదలవుతుంది. తాను రోజుకు కనీసం ఆరు క్లాసులు బోధించగలనని ఆమె చెప్తారు. బోధనలో సమయం, శక్తి అనేవి రెండు ముఖ్యమైన అంశాలని, దానిని ఎల్లప్పుడూ తన మనస్సులో ఉంచుకుంటానని శాంతమ్మ చెబుతారు.తాను వైజాగ్ నుండి విజయనగరం వరకు ప్రతిరోజూ కనీసం 60 కి.మీ ప్రయాణిస్తారు.ఆమె వృత్తిలో భాగంగా ఇప్పటివరకూయూఎస్, బ్రిటన్, కెనడా, స్పెయిన్‌తో సహా అనేక దేశాల్లో జరిగిన సమావేశాలకు కూడా హాజరవుతుంటారు. అటామిక్ స్పెక్ట్రోస్కోపీ, మాలిక్యులర్ స్పెక్ట్రోస్కోపీకి సంబంధించిన ఆమె విశ్లేషణ 2016లో వెటరన్ సైంటిస్ట్స్ క్లాస్‌లో అనేక అవార్డులు, బంగారు పతకాన్ని అందించింది. ఆంధ్రా యూనివర్శిటీ మాజీ వీసీ, విజయనగరంలోని సెంచూరియన్ విశ్వవిద్యాలయం ప్రస్తుత వీసీ ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు తన విద్యార్థి అని ఆమె గర్వంగా చెప్తారు.
ప్రొఫెసర్‌కి పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులపై కూడా ఆసక్తి ఉంది. ఆమె "భగవద్గీత - ది డివైన్ డైరెక్టివ్" అనే పుస్తకాన్ని రచించింది, ఇది భగవద్గీత శ్లోకాల ఆంగ్ల అనువాదం. తన భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. ఆయన తెలుగు ప్రొఫెసర్‌గా ఉంటూ ఆమెకు ఉపనిషత్తులను పరిచయం చేశారు. యువ తరానికి ఉపయోగపడే అంశాలపై త్వరలో పుస్తకాన్ని విడుదల చేసేందుకు వాటిని అధ్యయనం చేస్తున్నట్లు శాంతమ్మ చెప్తున్నారు.