Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీమిండియా హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్..!!

ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. సుదీర్ఘమైన సిరీస్ ఇది. వచ్చేనెల 13వ తేదీ వరకు టీమిండియా అక్కడే ఉంటుంది. వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, అయిదు టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లను ఆడనుంది. ఈ నెల 12వ తేదీన తొలి టెస్ట్ ఆరంభమౌతుంది. డొమినికాలోని రోసౌ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక.

ఇప్పటికే జట్టు ప్లేయర్లందరూ వెస్టిండీస్ చేరుకున్నారు. నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంటోన్నారు. ఈ సిరీస్ కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు.. టెస్టులు, వన్డేల కోసం రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది. దీని తరువాత జరిగే అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం మరో జట్టును కూడా ప్రకటించింది బీసీసీఐ.

VVS Laxman

వెస్టిండీస్‌తో సిరీస్ తరువాత టీమిండియా.. ఐర్లాండ్ పర్యటనకు బయలుదేరి వెళ్తుంది. మూడు టీ20 మ్యాచ్‌లను ఆడుతుంది. ఆగస్టు 18, 20, 23 తేదీల్లో ఈ మూడు మ్యాచ్‌లు షెడ్యూల్ అయ్యాయి. భారత కాలమానం ప్రకారం.. సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్‌లు ఆరంభమౌతాయి. ఐర్లాండ్‌లోని మలహిడె క్రికెట్ క్లబ్ గ్రౌండ్.. ఈ మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది.

దీని తరువాత భారత జట్టు ఆసియా గేమ్స్‌లో పాల్గొంటుంది. చైనాలోని హౌంగ్ఝౌలో ఆసియా గేమ్స్ జరుగనున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఆసియా గేమ్స్ జరుగనున్నాయి. ఇందులో మహిళలతో పాటు పురుషుల భారత క్రికెట్ జట్టు పాల్గొంటుంది. పురుషుల క్రికెట్ జట్టు ఆసియా గేమ్స్‌లో ఆడటానికి ఉద్దేశించిన ప్రతిపాదనలపై బీసీసీఐ ఇదివరకే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

VVS Laxman

ఐర్లాండ్‌తో పాటు ఆసియా గేమ్స్ ఆడబోయే భారత పురుషుల క్రికెట్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకోనుంది. ఈ రెండు సిరీస్‌లల్లో ఆడబోయే భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా హైదరాబాద్‌కు చెందిన మాజీ ప్లేయర్ వీవీఎస్ లక్ష్మణ్‌ అపాయింట్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హెడ్ కోచ్‌గా పని చేస్తోన్న రాహుల్ ద్రావిడ్‌కు విశ్రాంతిని ఇచ్చి- ఆయన స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌కు నియమించే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+