వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాకతీయుల వారసుడొచ్చాడు.. అంబరాన్ని తాకేలా కాకతీయ వైభవ సప్తాహం సంబరాలు ప్రారంభం

|
Google Oneindia TeluguNews

అంబరాన్ని తాకేలా కాకతీయ సంబరాలు కాకతీయ వైభవ సప్తాహం ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో కాకతీయుల ఘనకీర్తిని తెలియజేసేలా తెలంగాణలో శతాబ్దాల అనుబంధం ఉన్న కాకతీయుల చరిత్ర పాలన వైభవం కళా విశిష్టతలను భావితరాలకు తెలిపేలా నేటి నుండి ఏడు రోజుల పాటు నిర్వహించనున్న కాకతీయ వైభవ సప్తాహం సంబరాలకు కాకతీయుల వారసుడొచ్చాడు. కాకతీయుల వారసుడి రాకతో సంబరాలు జోరందుకున్నాయి.

కాకతీయులు ఏలిన గడ్డపై అడుగుపెట్టిన కాకతీయుల వారసుడు

కాకతీయులు ఏలిన గడ్డపై అడుగుపెట్టిన కాకతీయుల వారసుడు

తెలంగాణను పరిపాలించిన రాజులలో కాకతీయ రాజులది విశిష్టమైన స్థానం. కాకతీయుల కాలంలో తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందింది. నేటికీ కాకతీయుల కళా సంపద తెలంగాణ రాష్ట్రానికి మకుటాయమానంగా నిలుస్తుంది. అలాంటి కాకతీయుల వైభవాన్ని నేటి తరానికి చాటాలని ఉద్దేశంతో టిఆర్ఎస్ ప్రభుత్వం కాకతీయ వారోత్సవాలను నిర్వహించ తలపెట్టి, ఆ వారోత్సవాల కు ముఖ్యఅతిథిగా కాకతీయ వంశానికి చెందిన కమల చంద్ర భాంజ్ దేవ్ ను ఆహ్వానించింది.

కాకతీయ వారసుడికి ఘన స్వాగతం పలికిన మంత్రులు..

కాకతీయ వారసుడికి ఘన స్వాగతం పలికిన మంత్రులు..


ఈ క్రమంలో తమ పూర్వీకులు పాలించిన గడ్డపై కాలు పెట్టిన కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భాంజ్ దేవ్ కు హనుమకొండ హరిత హోటల్ నుంచి వరంగల్ భద్రకాళి ఆర్చ్ వరకు ఘన స్వాగతం పలికారు. కాకతీయుల వారసుడు మహారాజా కమల చంద్ర భాంజ్ దేవ్ ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భాంజ్ దేవ్ కు రాష్ట్ర మంత్రులు సాదర స్వాగతం పలికారు. భద్రకాళి ఆలయం స్వాగత ద్వారం వద్ద మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తో పాటు జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు.

పేరిణి నృత్యాలతో, డప్పు చప్పుళ్ళతో ఘన స్వాగతం

పేరిణి నృత్యాలతో, డప్పు చప్పుళ్ళతో ఘన స్వాగతం

హరిత హోటల్ నుండి ఆయన ఊరేగింపు కొనసాగింది. మొదట వేయిస్తంభాల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రకాళి ఆలయం స్వాగత ద్వారం నుంచి ఆలయం వరకూ డప్పు చప్పుళ్ళతో పేరిణి నృత్యాలతో, వివిధ కళారూపాల ప్రదర్శనలతో కమల్ చంద్ర భాంజ్ దేవ్ కు స్వాగతం పలికారు. ఆయన రాకను పురస్కరించుకుని పెద్ద ఎత్తున ఊరేగింపు కొనసాగించారు. అనంతరం భద్రకాళి ఆలయం లో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భద్రకాళీ చెరువు కట్టపై హరితహారంలో కాకతీయ వారసుడు మొక్కలు నాటారు.

కాకతీయుల కోటలో కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భాంజ్ దేవ్

కాకతీయుల కోటలో కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భాంజ్ దేవ్

ఆపై వరంగల్ కు చేరుకున్న కమల్ చంద్ర భాంజ్ దేవ్, రాణి రుద్రమదేవి విగ్రహానికి పూల మాల వేశారు. ఆపై కాకతీయులు పాలించిన కోట ప్రాంతాన్ని సందర్శించారు కాకతీయుల వారసుడు కమల్ చంద్ర భాంజ్ దేవ్. ఖిల్లా వరంగల్ కోటలోనూ కాకతీయ వారసుడి రాకతో సంబరాలు అంబరాన్ని తాకాయి. కాకతీయుల వారసుడు ఏ మాత్రం రాజ ఠీవి తగ్గకుండా కోటలో పర్యటించారు. ఓరుగల్లు కోటలో రథంపై ఘనంగా ఆయన ఊరేగింపు సాగింది.

 కత్తి తీసి చూపిస్తూ కాకతీయుల వారసుడి రాజసం

కత్తి తీసి చూపిస్తూ కాకతీయుల వారసుడి రాజసం


ఆయన ఒరలోనుండి కత్తి తీసి చూపిస్తూ కాకతీయుల పౌరుషాన్ని గుర్తు చేశారు. రాజసం ఉట్టిపడేలా ఉన్న కాకతీయుల వారసుడిని చూడటానికి స్థానికులు ఉత్సాహం చూపించారు. ఇక ఈ రోజు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాకతీయ ఉత్సవాలను ప్రారంభించిన నేపథ్యంలో వారం రోజుల పాటు ఓరుగల్లు నగరం కాకతీయ ఉత్సవాలతో సందడిగా మారనుంది. ఫుడ్ ఫెస్టివల్, కార్నివాల్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకోనున్నాయి. సాహితీ సదస్సులు, కవి సమ్మేళనాలు ఆకట్టుకోనున్నాయి.నిత్యం నాటకాల ప్రదర్శన కొనసాగనుంది.

English summary
The 22nd heir of Kakatiya, Kamal chandra Bhanjdev, came as chief guest to the Kakatiya utsavalu2022. Ministers extended a warm welcome to Kamal Chandra Bhanj Dev. A grand procession was held. With the arrival of the heir, the celebrations began.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X