చికాగోలో బతుకమ్మ వేడుకలు

Chicago Telangana Association
చికాగో తెలంగాణ అసోసియేషన్(చితా) ఆధ్వర్యంలో 9వ వార్షిక బతుకమ్మ ఉత్సవాలను ఈ నెల 17వ తేదిన చికాగోలో నిర్వహించారు. అదే రోజు తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినాన్ని జరుపుకున్నారు. చికాగో ల్యాండ్స్ నాపర్విల్లే రివర్ పార్క్‌లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన బతుకమ్మ ఉత్సవం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఈ ఉత్సవం తోకల రవిగారి తెలంగాణ సాంస్కృతి పాటతో ప్రారంభమైంది. చితా వాలెంటర్స్ అక్కడే లంచ్ ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున హాజరైన ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. దీంతో అక్కడి ప్రాంతమంతా బతుకమ్మ ఉత్సవాలతో సందడిగా తయారయింది. చితా తొమ్మిదేళ్ల క్రితం చికాగోలో బతుకమ్మ పండుగను ప్రారంభించింది. అప్పటి నుండి ఈ సంప్రదాయం కొనసాగుతూనే వస్తోంది. ప్రతి సంవత్సరం బతుకమ్మకు ఆధరణ పెరుగుతూనే ఉంది.

నాలుగు వందల మందికి పైగా బతుకమ్మ పండుగలో పాల్గొన్నారు. చూడటానికి చాలా ముచ్చటగా ఉండటంతో స్థానికంగా ఉన్న అమెరికా కుటుంబాలు సైతం ఈ పండుగలో పాలు పంచుకున్నాయి. ఈ పండుగ సాంప్రదాయ బద్దంగా చాలా బతుకమ్మలతో, పూజతో ప్రారంభమైంది. బతుకమ్మలను వారి వారి ఇళ్ల వద్దనే తయారు చేసుకున్నారు. మహిళలు, పిల్లలు పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతుంటే మిగిలిన వారు వారిని ఉత్సాహపరిచారు. పెద్ద సంఖ్యలో అమ్మాయిలు ఈ బతుకమ్మ పండుగలో పాల్గొన్నారు. చితా మహిళా వాలెంటర్లు అక్కడ అందరినీ సమన్వయ పరిచారు.

మహిళలు సుమారు మూడు గంటల పాటు బతుకమ్మ ఆడారు. పలువురికి చితా ప్రైజులు అందజేసింది. ఈ కార్యక్రమం ఆసాంతం ఉత్సాహంగా నడిచింది. భారత్ నుండి వచ్చిన పలువురు తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆనందపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణ పెద్దలు తెలంగాణ విమోచన దినం గురించి వివరించారు. భారత్ నుండి వచ్చిన ప్రముఖ రచయిత లక్ష్మీకాంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చితా మెంబర్స్ తెలంగాణ అభివృద్ధి ఆవశ్యకత, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ వివరించారు. చితా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని పలువురు వాలెంటీర్స్‌తో పాటు న్యూయార్క్ లైఫ్ ఇన్సురెన్సుకు చెందిన క్రిష్ణ రంగరాజు స్పాన్సర్ చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ చితా ధన్యవాదాలు తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+