బ్రిటిష్ అల్లర్లు: సిక్కు టీవీ ప్రజెంటర్ హీరో

British Riots
బ్రిటిష్ అల్లర్లను, లూటీలను కవర్ చేసిన బ్రిటిష్ సిక్కు టీవీ ప్రెజెంటర్ ఫేస్‌బుక్ హీరో అయ్యాడు. బర్మింగ్‌హామ్ వీధుల్లో తన కెమెరాతో అల్లర్లను, లూటీలను కెమెరాలో బంధిస్తూ దుండగులను పట్టుకోవడానికి ఆ టీవీ ప్రెజెంటర్ ఉపిందర్ రాంధావా పోలీసులకు సహాయపడ్డాడు. ఇండియాలో జన్మించిన 31 ఏళ్ల రంధావా 2005లో బ్రిటన్ వెళ్లాడు. ఫేస్‌బుక్‌లో అతనిపై ఉపిందర్ రాంధావా ఫ్రమ్ సంగత్ టీవి ఈజ్ ఎ లెజెండ్ అని రాశారు. అతనికి 4వేల మంది అభిమానులు తయారయ్యారు. సంగత్ టీవీలో పనిచేస్తున్న రాంధావా తీసిన ఫుటేజ్‌లను సిఎన్ఎన్, బిబిసి వాడుకున్నాయి. దాంతో నిందితులను పట్టుకోవడం సులభమైంది.

ఎడ్జ్‌బస్టన్‌లోని ఓ మేక్‌షిఫ్ట్ గది నుంచి పనిచేసే సంగత్ టీవీ చానెల్‌ను ప్రధాని డేవిడ్ కామెరూన్ కూడా ప్రశంసించారు. అల్లరి మూకలను ఎదుర్కోవడానికి రాంధావా ఏ మాత్రం జంకు చూపలేదని బ్రిటిష్ మీడియా ప్రశంసించింది. తమకు బ్రిటిష్ మీడియా సరైన కవరేజ్ ఇవ్వడం లేదనే ఉద్దేశంతో సంగత్ టీవీ ప్రారంభమైనట్లు బర్మింగ్‌హామ్ సిటి కౌన్సిలర్ గుర్దియాల్ సింగ్ చెప్పారు. సంగత్ టీవీ కవరేజ్‌నని గెరిల్లా జర్నలిజంగా బిబిసి అభివర్ణిస్తూ ఓ కెమెరా, ఓ మైక్రోఫోన్‌ సహాయంతో రాంధావా అల్లర్ల కవరేజ్‌లో అందరికీ తెలిసిన ముఖంగా మారిపోయాడని ప్రశంసించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+