వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫేస్‌బుక్‌లో ఎన్నారైల నిరసన ప్రచారం

By Pratap
|
Google Oneindia TeluguNews

Protest campaign on Facebook
అమెరికాలోని తెలంగాణ ఎన్నారైలు వినూత్నమైన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ వారు ఈ ప్రచారాన్ని చేపట్టారు. తెలంగాణ ఎన్నారై జెఎసి (టిఎన్నారై - జెఎసి) ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ ఫేస్‌బుక్‌లో ఈ నిరనస ప్రచారం ప్రారంభమైంది. టిఎన్నారై - జెఎసి నాలుగు చిత్రాలను అందజేస్తోంది. వాటిలో ఏదో ఒక దాన్ని ఫేస్‌బుక్ ఇమేజ్ ప్రొఫైల్‌గా పెట్టి నిరసన తెలియజేయాలని టిఎన్నారై జెఎసి ప్రతినిధి రవి మేరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఐ ప్రటొస్ట్ అనే నినాదంతో ఆ ఇమేజ్‌లను రూపొందించారు.

నెట్ కమ్యూనిటీ యావత్తూ తమ నిరసనను తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రచారానికి పూనుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి తెలంగాణవాదిని చేరేందుకు అవసరమైన సోషల్ నెట్‌వర్కింగ్ వ్యూహాలను తాము అనుసరిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్ చేస్తూ తెలంగాణవాదులు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలను బహిష్కరిస్తున్న విషయం తెలిసిందే. నవంబర్ 1వ తేదీని తెలంగాణవాదులు విద్రోహదినంగా పరిగణనిస్తున్నారు.

English summary
Telanganites across the globe will put one of these images as their FACEBOOK profile image and show their protest. The campaign already picked up the pace and every telanganite is changing their profile photo to "I Protest" image.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X