వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు ఎన్నారైల కోసం సదస్సు

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI
పన్ను ప్రణాళిక చట్టసమ్మతం, పన్ను ఎగవేత చట్టవిరుద్ధం, ఆర్థిక వ్యవహారాలపై సరైన నిర్ణయం తీసుకోండి అనే అనే అంశంపై ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) డల్లాస్‌లోని ఇండియన్ కమ్యూనిటీ కోసం సదస్సు నిర్వహించింది. టాంటెక్స్ బిజినెస్, మెంబర్ సర్వీసెస్ చైర్ పూర్ణచంద్రరావు వేములపల్లి స్వాగతం చెప్పారు. బిఎంఎస్ కార్యకలాపాల గురించి ఆయన సంక్షిప్తంగా వివరించారు. ఆదాయం పన్నుకు సంబంధించిన వివిధ అంశాలపై ఇటువంటి సదస్సు అవగాహన కల్పిస్తుందని ఆయన చెప్పారు.

కస్టమర్ సర్వీస్ మేనేజర్ కైరా సరైన పన్ను నిర్వహణకు సంబంధించిన వివరాలను అందించారు. పర్ఫెక్ట్ టాక్స్ వ్యవస్థాపకుడు మహేష్ ఠక్కర్ నేతృత్వంలోని శాం ఠక్కర్, పూర్వేష్ ఠక్కర్, కైరా బృందం పన్ను ప్రణాళిక అంశాలపై వివరంగా చెప్పారు. సదస్సుకు హాజరైనవారు వేసిన ప్రశ్నలకు వారు సమాధానాలిచ్చారు. బిజినెస్, మెంబర్ సర్వీస్ కమిటీకి చెందిన వేములపల్లి, విజయ్ మోహన్ కాకర్ల, రాజేష్ చిలుకూరిల వందన సమర్పణతో సదస్సు ముగిసింది.

English summary
Telugu Association of North Texas (Tantex) organized seminar on tax filing and financial planning in Dallas. Purnachandra Rao Vemullapalli played main role in organizing the seminar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X