జూపల్లికి తెలంగాణ ఎన్నారైల అభినందన

తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి తెలంగాణ ఉద్యమంలో వెంటనే చేరిపోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేకుంటే వారు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని అన్నారు. రాజీనామాలు చేయని ప్రజాప్రతినిధులకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. తెలంగాణపై తెలుగుదేశం ద్వంద్వ వైఖరి ఎండగట్టడంలో ముఖ్య భూమిక పోషించిన నాగం జనార్దన్ రెడ్డిని కూడా తెలంగాణ ఎన్నారైలు అభినందిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ నాయకులు, సామాజిక సంఘాల ప్రితినిధులు జెఎసి గొడుగు కిందికి వచ్చి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications