ఘనంగా తానా సభలు: ప్రసాద్ తోటకూర

అమెరికాలోని తెలుగువాళ్లంతా కలిసే ఉన్నారని చాటడానికి ఈ సభలు ఉపయోగపడుతాయని అభిప్రాయపడ్డారు. 2013లో జరిగే మహాసభకు డాక్టర్ నవనీత కృష్ణ గొర్రెపాటి అద్యక్షుడిగా, రాఘవేంద్ర ప్రసాద్ సలహా మండలి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారని ఆయన చెప్పారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఈ మహాసభల సహ ఆతిథ్య సంస్థగా వ్యవహరిస్తోంది. తానా ప్రాంతీయ ప్రతినిధి మంజులత కన్నెగంటి స్వాగతం చెప్పారు.
డాక్టర్ నవనీత కృష్ణ గొర్రెపాటి, డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ వంటి తానా మాజీ అధ్యక్షులు, తానా ట్రస్టీల బోర్డు చైర్మన్ డాక్టర్ చౌదరి జంపాల వంటి వారు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 600 మందికి పైగా ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. తానా సభ్యులు మహాసభల నిర్వహణకు భారీగా విరాళాలు ప్రకటించారు. కార్యక్రమం ముగిసే సమయానికి ఆరు లక్షల డాలర్లకు పైగా విరాళాలు వచ్చాయి.
తెలుగు సినీ నటి ప్రణీత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహాసభలు విజయవంతం కావాలని ఆమె ఆశించారు ఈ కార్యక్రమంలో చిన్నారులు చేసిన నృత్యాలు అందరినీ ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో మురళీ వెన్నం, పెలప్రోలు సాగర్, సాంబ జస్టి, శివ వంకాయలపాటి, డాక్టర్ రాఘవ రెడ్డి, డాక్టర్ పైల్లా మల్లారెడ్డి, చలపతి రావు కొండ్రుకుంట, లీలా కుమార్ ఖాజా, శేషగిరి రావు బత్తుల తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications