• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చరిత్ర సృష్టించిన బేరా, తులసి

By Pratap
|
Bera, Tulsi create history; sworn in as US lawmakers
వాషింగ్టన్: కాలిఫోర్నియాకు చెందిన ఇండియన్ అమెరికన్ ఫిజిషియన్ అమీ బేరా, హవాయ్‌కి చెందిన ఇరాక్ వార్ వెటరన్ తులసి గబ్బర్డ్ అమెరికా హౌస్ ఆఫ్ రెప్రజెంటెటివ్స్‌గా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించారు. వారు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. హౌస్ ఆఫ్ రెప్రజెంటెటివ్‌గా ఎన్నికైన మూడో ఇండియన్ అమెరికన్ బేరా.

అంతకు ముందు ఇండియన్ అమెరికన్స్ దలీప్ సింగ్ సౌంధ్ 1950లో, 2005లో బాబీ జిందాల్ హౌస్ ఆఫ్ రెప్రజెంటిటివ్‌లుగా ఎన్నికయ్యారు. తులసి గబ్బర్డ్ కాంగ్రెసుకు జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన మొదటి హిందువు. 113వ కాంగ్రెసులో 43 మంది ఆఫ్రికన్ అమెరికన్ సభ్యులుననారు. రికార్డు స్థాయిలో వంద మంది మహిళలున్నారు.

బేరా, తులసి కూడా డెమొక్రటిక్ పార్టీకి చెందినవారే. బేరా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన భార్య, కూతురు, సోదరులు, తండ్రి పాల్గొన్నారు. తలసి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రముఖ హిందూ అమెరికన్లు హాజరయ్యారు. ఆమె భగవద్గీతపై ప్రమాణం చేశారు.

జీవితంలో ఎదురైన అనేక సవాళ్ల నుంచి తనకు అంతరంగ ప్రశాంతతను, శక్తిని భగవద్దీత ప్రసాదించిందని గబ్బర్డ్ అన్నారు. ఆమె పుట్టుక రీత్యా హిందువు కాదు. ఆమె తండ్రి మైక్ గబ్బర్డ్ ప్రస్తుతం హవాయ్ స్టేట్ సెనేటర్‌గా ఉన్నారు. తల్లి కరోల్ పోర్టర్ గబ్బర్డ్ ఎడ్యుకేటర్, బిజినెస్ ఓనర్.

తన తల్లి హిందువు అని, తండ్రి కాథలిక్ అని తులసి గబ్బర్డ్ చెప్పారు. టీనేజర్‌గా ఉన్నప్పుడే తలసి హిందూ మతాన్ని స్వీకరించారు. భగవద్దీత బోధనల ద్వారా తాను ఆధ్యాత్మిక ప్రయాణం చేశానని ఆమె అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary

 Indian American physician from California, Ami Bera, and the young Iraq war veteran from Hawaii, Tulsi Gabbard, created history on Thursday after being sworn in as new members of the US House of Representatives.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more