• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

|

కువైట్: గల్ఫ్ దేశాల్లోని తెలుగు సంఘాలు ఒక తాటిమీదకు వచ్చి 'గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య' గా ఏర్పడి ఎన్నో కార్యక్రమాలను గత సంవత్సర కాలంగా పూర్తిగా ఆన్‌లైన్లో జరుపుకుంటున్నారు. మన భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 74 సంవత్సరాలు నిండి 75 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభతరుణంలో మన ప్రధాని నరేంద్ర మోడీ.. అజాది కా అమృత్ మహోత్సవ్ పేరుతో ఈ సంవత్సరం అంతా వేడుకలను జరుపుకోవాలని పిలుపునివ్వటంతో గల్ఫ్‌లోని తెలుగు సంఘాలవారు కూడా ఈ 7 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా పూర్తిగా వర్చువల్ పద్దతిలో జరుపుకున్నారు.

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

తెలుగు సంఘాల ఐక్య వేదిక- కువైట్ వారి ఆధ్వర్యములో, గల్ఫ్ దేశాలలోని 8 తెలుగు సంఘాల భాగస్వామ్యముతో పుర్తిగా దేశభక్తి నేపద్యంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కువైట్లో భారత రాయభారి సిబి జార్జి, ప్రత్యేక అతిధిగా శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజరాపు రామ్మోహన్నాయుడు, గౌరవ అతిధిగా అమెరికాలోని తానా సంస్థ అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి విచ్చేసి గల్ఫ్ దేశాలలోని భారతీయులకు, ప్రపంచం నలుమూలల ఉన్న భారతీయులకు 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియ చేసి తమ అమూల్యమైన సందేశాన్ని వినిపించారు. ఈ కార్యక్రమములో దేశభక్తి నేపథ్యంతో రూపొందించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అమితంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమములో ఐదు సంవత్సారాల పిల్లల నుంచి 80 సంవత్సారాల పెద్దల వరకు పాల్గొన్నారు. ఈ కార్యక్రమ వ్యాఖ్యాత వెంకప్ప భాగవతుల కార్యక్రమాన్ని ఆసాంతం వినోదభరితంగా నడిపించి అందరి మన్నలను అందుకున్నారు.

ఎన్నారై సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో..

ఎన్నారై సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో..

తెలుగు సంఘాల ఐక్య వేదిక- కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర రావు మట్లాడుతూ.. మన భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఇలా గల్ఫ్ దేశాలలోని తెలుగు సంఘాలు కలిసి చేసుకోవటం చాలా సంతోషం అన్నారు. ఈ కార్యక్రములో భాగస్వాములైన తెలుగు కళా సమితి బహరైన్, తెలుగు కళా సమితి ఓమన్, ఆంధ్ర కళా వేదిక ఖతార్, సౌదీ తెలుగు అసోసియేషన్ సౌది అరేబియా, తెలుగు కళా స్రవంతి అబుధాబి, ఫుజైరియ తెలుగు కుటుంబాలు ఫుజైరియ, తెలుగు తరంగిణి - రాస్ అల్-కైమా సంస్థల అధ్యక్షులకు, వారి కార్యవర్గ సభ్యులకు, ప్రదర్శనలు ఇచ్చిన పిల్లలకు, పెద్దలకు అందరికి ధన్యవాదములు తెలియ చేశారు.

  #TopNews : Chandrababu ప్లాన్ విఫలం | Pandem Kodi తరహా లో Rapo 19 || Oneindia Telugu
  సురభి నాటకాలను ఆదుకోండి..

  సురభి నాటకాలను ఆదుకోండి..

  ఈ కార్యక్రమానికి స్పాన్సర్స్‌గా కుదరవల్లి ఫౌండేషన్, శుభోదయం ఇంఫ్రా వారు వ్యవహరిచారు. మీడియా పార్ట్నర్ గా కువైట్ ఆంధ్ర చానెల్, సాంకేతిక సహకారం విక్రం సుఖవాసి, ఆర్కే వీడీయొగ్రఫీ సింగపూర్ వారు అందించారు. గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య గూర్చి మాట్లాడుతూ.. శ్రీ కుదరవల్లి సుధాకర రావు కష్టకాలంలో వున్న సురభి నాటక రంగానికి చేయూతనివ్వాలనే తలంపుతో ప్రతినెల ఒక తెలుగు సంఘం వారి ఆధ్వర్యములో ఒక్క సురభి నాటకాన్ని ప్రదర్శించే విధముగా కార్యాచరణ రూపొందించి జులైలో తెలుగు కళా సమితి బహరైన్ వారి ఆధ్వర్యములో మాయాబజార్‌ను, ఆగస్టులో తెలుగు కళా సమితి ఓమన్ వారి ఆధ్వర్యములో పాతాళభైరవి నాటకాన్ని ప్రదర్శింప చేయడం జరిగింది అనీ ఇలాగే జనవరి వరకు ప్రదర్శించబడతాయి అన్నారు.
  అలాగే శ్రీ కుదరవల్లి సుధాకర రావు మాట్లాడుతూ.. మన తెలుగు బాష సాంస్కృతి సంప్రదాయలను పెంపొందించే విధముగా గల్ఫ్ దేశాలతో పాటు ఇతర ప్రపంచ దేశాలలోని తెలుగు సంఘాలవారు నిర్వహించే కార్యక్రమాల్లో కూడా భాగస్వాములవుతూ గల్ఫ్‌లో వున్న తెలుగువారి ప్రతిభను ప్రపంచ నలుమూలలా తెలియచేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా గత సంవత్సరం జులై నెలలో తానా వారి ఆధ్వర్యములో జరిగిన ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవం, ఈ సంవత్సరం ఏప్రియల్ నెలలో జరిగిన మహా కవి సమ్మేళనం, ఇటీవల సింగపూర్ వారి అధ్వర్యములో జరిగిన సాంస్కృతిక సమ్మేళనం, ఐబీఏఎం, యూఎస్ఏ వారు ప్రపంచ వ్యాప్తంగా పిల్లలకు జరిపిన భాగవత పద్య పఠన పొటీలలో కూడా అన్ని గల్ఫ్ దేశాల తెలుగు సంఘాల వారు పాల్గొని తమ సత్తా చాటి అందరి ప్రశంసలు పొందారు.

  English summary
  75th independence day celebration held in gulf countries by telugu association
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X