NRI News: ఎన్నారైకి భార్య కాబోతున్నానని రూ.15 లక్షలు పంపింది.. ఆ తర్వాతే సీన్ రివర్స్ అయింది..!
ఢిల్లీకి చెందిన 36 ఏళ్ల మహిళ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి రూ.15 లక్షలు పోగొట్టుకుంది.
ఢిల్లీకి చెందిన 36 ఏళ్ల మహిళకు గత ఏడాది ఏప్రిల్ 26న మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా సింగ్ అనే ఎన్నారై పరిచయమయ్యాడు. తాను UKకి చెందిన ఎన్‌ఆర్‌ఐ వైద్యుడి అని చెప్పాడు. కొంతకాలం ఆన్‌లైన్‌లో ఇంటరాక్ట్ వారు కలిశారు. ఆ తర్వాత వారి మొబైల్ నంబర్లు ఇచ్చిపుచ్చుకుని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. వారు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు.

ముంబై
తాను UKలో పేరుగాంచిన వైద్యుడని, వివాహానంతరం నీకు విలాసవంతమైన జీవనశైలిని కూడా ఇస్తానని ఆమెతో చెప్పాడు. వాట్సాప్ వీడియో కాల్‌లో సింగ్ తన UK ఇంటిని చూపించాడు. ఆ ఇళ్లు చాలా పెద్దగా విలాసవంతంగా ఉంది. దీంతో ఆమె తన లైఫ్ సెటిల్ అయిందని భావించింది. కొంత కాలం గడిచిన తర్వాత 2022 మే రెండో వారంలో తాను ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకుంటానని మహిళకు చెప్పాడు. సింగ్ మే 23, 2022 కోసం ఖతార్ ఎయిర్‌వేస్‌లో లండన్ నుంచి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి టిక్కెట్‌ను బుక్ చేశాడు.

టికెట్
ఆ ఈ-టికెట్‌ను ఆమెకు వాట్సాప్ చేశాడు. ముంబై మీదుగా ఢిల్లీకి వస్తానని చెప్పాడు. సింగ్ మే 24న ఆమెకు ఫోన్ చేసి తాను ముంబై విమానాశ్రయానికి చేరుకున్నానని, అయితే కస్టమ్స్ అధికారులు తనను అదుపులోకి తీసుకున్నారని చెప్పాడు. వారు రూ. 15.59 లక్షలు డిమాండ్ చేస్తున్నారని చెప్పాడు. ఓ కస్టమ్స్ అధికారిగా నటిస్తూ ఆ మహిళతో మాట్లాడు. సింగ్ ఖాతాలోకి డబ్బును ఆన్‌లైన్‌లో బదిలీ చేయమని కోరాడు.

నైజీరియన్ విద్యార్థులు
ఆ తర్వాత మహిళకు వేర్వేరు బ్యాంక్ ఖాతాలు పించారు. ఆ మహిళ ఖాతాల్లోకి రూ.15.59 లక్షలను పంపించింది. రెండు గంటల్లో వస్తానని సింగ్ చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత అతను రాలేదు.. ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ వస్తుంది. దీంతో మోసపోయానని తెలుసుకున్న మహిళ 2023 జనవరి 31న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొంతమంది నైజీరియన్ విద్యార్థులకు ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.

మ్యాట్రిమోనియల్ పోర్టల్
"వారు తమ అంతర్జాతీయ రోమింగ్ నంబర్‌లను మ్యాట్రిమోనియల్ పోర్టల్‌లలో వదిలి UKలో ఉన్నట్లు నటిస్తారు. వాస్తవానికి, వారు ఢిల్లీలో లేదా ఇతర నగరాల్లో ఉంటారు " అని అధికారి తెలిపారు. "ఈ కేసులో, తాను నిందితుడితో వీడియో కాల్‌లో మాట్లాడానని, నిందితుడి ఇంటిని చూశానని మహిళ పేర్కొంది, అయితే ఇతర కేసులలో వారు వాట్సాప్‌లో చిత్రాలను పంచుకోవడం, చాట్ చేయడం మాత్రమే మేము చూశాము" అని చెప్పారు.












Click it and Unblock the Notifications