NRI News: ఆచార్య కొలకలూరి ఇనాక్‍కు స్వాగతం పలికిన ఆట..
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వెంకటేశ్వర యూనివర్సిటీ పూర్వ ఉప కులపతి పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఆయన అమెరికాలో పలు సాహిత్య కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. 2023 అక్టోబర్ 3న వర్జీయాలో అమెరికా తెలుగు సంఘం (ఆటా) ప్రెసిడెంట్ ఎలెక్ట్ జయంత్ చల్లా ఇనాక్ ను మర్యాద పూర్వకంగా కలశారు. హైదరాబాద్ లో డిసెంబర్ 17న జరగనున్న ఆటా డేస్ సాహిత్య కార్యక్రమాల్లో, అలాగే జూన్ లో జరిగే ఆటా కన్వెన్షన్ లో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పలికారు.
ఇనాక్ చాలా సంతోషంగా ఈ ఆహ్వానాన్ని స్వీకరించి వెంటనే తన అంగీకారం తెలిపారు. అలాగే ప్రముఖ అవధాని నరాల రామారెడ్డిని కూడా జయంత్ చల్లా హైదరాబాద్ ఆటాడేస్ సాహితీ కార్యక్రమాలకి, అమెరికాలో జరగనున్న ఆటా కన్వెన్షన్ కి ఆహ్వానించారు. ఆటా డేస్ సాహిత్య కార్యక్రమాల నిర్వాహకులు నక్షత్రం వేణు సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అమెరికాలోని తెలుగు అందరు కలిసి ఉండడం చాలా ఆందంగా ఉందని కార్యక్రమంలో పాల్గొన్న వారు చెబుతున్నారు.

తెలుగు సంస్కృతిని మరిచిపోకుండా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నందకు ఆటను అభినందించారు. ఇలానే భవిష్యత్ లో కూడా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. కొద్ది రోజలు క్రితం ఆమెరికాలో ఆట ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదుతో పాటు షటీల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు వారు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బ్యాట్మెంటన్ లో పిల్లలు, పెద్దలు ఉత్సహాంగా పాల్గొని ఆడారు.
త్వరలో బతుకమ్మ పండుగ వస్తుండడంతో బతమ్ము పండుగను ఆటా ఆధ్వర్యంలో నిర్వహించే అవకాశం ఉంది. ఈ మధ్యే అమెరికా తెలంగాణ సంఘం ఆటలో విలీనం అయింది. దీంతో రెండు రాష్ట్రాలకు సంబంధించిన పండుగలను ఆట ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలుగు ఎక్కడున్న తమ సంస్కృతి, సంప్రదాయాలని మరిచిపోకుండా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications