ఆగస్టు 23న ఆటా ‘సమ్మర్ ఫెస్ట్’
న్యూయార్క్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) వార్షిక సమ్మర్ ఫెస్ట్ వేడుకలు ఆగస్టు 23న(శనివారం) మన్రో, న్యూజెర్సీలో థాంప్సన్ పార్క్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆటా అధ్యక్షులు సుధాకర్ పెర్కారి ఒక ప్రకటనలో తెలిపారు.
వినోద భరితంగా సాగే ఈ కార్యక్రమంలో ప్రతి తెలుగు కుటుంబం పాల్గొనాలని ఆట బృందం కోరుతోందని చెప్పారు. ఆసక్తికరమైన సరదా ఆటలు, టాలీవుడ్, బాలీవుడ్ నృత్యాలు, మెహందీ, ఫేస్ పెయింటింగ్ లాంటివి ఉంటాయని తెలిపారు.

పిల్లలు, మహిళలు, పెద్దలు అన్ని వయస్సుల వారి కోసం మొత్తం కార్యక్రమాల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రక రకాల తినుబండారాలు, తెలుగు విందు భోజనాలు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయని పేర్కొన్నారు.
ఆటా నార్త్ ఈస్ట్ ప్రాంతీయ సభ్యుల బృందం ఈ కార్యక్రమం కోసం గత నెల రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమ ప్రవేశం ఉచితం, హాజరుకాదలచిన వారందరూ ఆటా వెబ్‌సైట్ లేదా ఫేస్‌బుక్ ద్వారా తమ పేరు నమోదు చేసుకోవాలని ఆట బృందం విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications