నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గంగారాం కుటుంబానికి ఎన్నారైల ఆర్థిక సాయం

By Pratap
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: బహ్రెయిన్‌లో ఇటీవల గుండెపోటుతో మరణించిన నిజామాబాద్‌ జిల్లా భీమ్‌గల్‌ మండలం మెండోరా గ్రామానికి చెందిన అల్లెపు గంగారాం (38) ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ నవంబర్ 26వ తేదీన గుండె పోటుతో మృతిచెందాడు.

అతని మృతదేహాన్ని 11 రోజుల్లో ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ఆధ్వర్యంలో 6 డిసెంబర్ స్వగ్రామానికి పంపించారు. మృతుడికి తల్లి తండ్రి భార్య నలుగురు కూతుళ్లు ఉన్నారు. అతని మరణంతో పెద్ద దిక్కును కోల్పోయారు.

Bahrain NRIs extend financial assistance to Ganagaram Family

దాంతోఆ కుటుంబ పరిస్థితులను చూసి ముందుకు వచ్చిన ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్ బోలిశెట్టి వారి తోటి ఉద్యోగులు నర్సింహా చారి, రాజన్న, చిరంజీవి, మలేష్, అజయ్, దేవిషింగ్, భజన్న, ప్రమోద్, గంగారాం తదితరులు 86, 500 రూపాయలు౹ ఇండియాకు పంపించారు.

ఎన్నారై టీఆర్ఎస్ సెల్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ గంగారాం ఇంటికి వెళ్లి ఆ కుటుంబాని పరామర్శించి ఓదార్చి అతని బంధువు గంగరాజం అధ్వర్యంలో 86, 500 రూపాయలను ఆయన కుటుంబానికి అందించారు.

Bahrain NRIs extend financial assistance to Ganagaram Family

ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహరేన్ ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్, జనరల్ సెక్రెటరీలు లింబాద్రి, డా రవి, సెక్రెటరీలు రవిపటేల్, సుమన్, రాజేంధార్, జాయంట్ సెక్రెటరీలు గంగాధర్, విజయ్, సంజీవ్, దేవన్న, ఎగ్సిక్యుటివ్ మెంబర్స్ సుధాకర్, రాజేష్, నర్సయ్య, సాయన్న, సిహెచ్ రాజేందర్, సర్న్ రాజ్, రాజేశ్వర్ జమ్ముల, వినోద్, వసంత్, శంకర్, రాజు, వెంకటేష్, రాంబాబు, బుచ్చిరెడ్డి, శేఖర్, భూమన్న, గంగాధర్, శ్రీగద్దె అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

English summary
Bahrain NRIs extended financial assistance to Allepu Gangaram family in Nizamabad district of Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X