ఐర్లాండ్‌లో బతుకమ్మ వేడుకలు

డబ్లిన్: ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఐర్లాండులో బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఇదే తొలిసారి. డబ్లిన్‌లో 40 మంది వాలంటీర్స్ కలిసి బతుకమ్మ పండుగని నిర్వహించారు.

ఈ బతుకమ్మ వేడుకకు ప్రాంతాలకు అతీతంగా 350 మంది హాజరయ్యారు. అమ్మాయిలు బతుకమ్మ ఆటను ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఆడారు. పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు. దుర్గా మాత పూజతో కార్యక్రమము మొదలైనది. బతుకమ్మ, దండియా ఆటలు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకున్నాయి .

అరవై మంది దాతలు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించటానికి తమకు సహకరించినట్లు ప్రభోద్ మేకల ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉచితంగా నిర్వహించారు. వచ్చిన అతిధులకు ప్రసాదం, రుచికరమైన వంటలు వడ్డించారు.

Bathukamma celebrations in Ireland

వీడియో - 1 చూడండి..

పిల్లలకి మేజిక్ షో మరియు ఇతర ఆటలు నిర్వహించారు . బతుకమ్మ పండుగ ముగిసిన తర్వాత జమ్మి/బంగారం ఒకరికొకరు పంచుకొని అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని చేశారు. పిల్లలు పెద్దలకు జమ్మి/బంగారం పెట్టి వాళ్ళ తల్లి తండ్రులకు పాదబివందనం చేశారు .

ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రబోధ్ మేకల, శ్రీనివాస్ కార్పె, కమలాకర్ కోలన్, రవీందర్ చప్పిడి, దయాకర్ కోమిరెల్లి, రాజేష్ ఆది, నరేందర్ రెడ్డి గూడ, సాగర్ ఆదెపు, అక్కపల్లి వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ అల్లంపల్లి, సంతోష్ పల్లె, శ్రీహరి శర్మ, శ్రీనివాస్ సిలవేణి, అల్లె శ్రీనివాస్, నవీన్ జనగాం, విజయేందర్ దుడిపాళ్ల, జగన్ మేకల, అల్లె శ్రీనివాస్, అనిల్ దుగ్యాల, శ్రీధర్ యామసాని, మాదిరెడ్డి భార్గవ్, భూపేష్ రెడ్డి, గాలి జాన్, నవీన్ గడ్డం, ప్రదీప్ రెడ్డి, వెంకట్ తిరుకోవలూరు, నగేష్ పోలూరి, సాయి రామ్, నరేష్ రెడ్డి, రామ (యాంకర్), గడ్డం హరి (యాంకర్), శృతి, వర్చూష మొదలగునవారు పాల్గోన్నారు.
వీడియో - 2 చూడండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+