NRI News: ఐర్లాండ్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు..
తెలంగాణలో పూల పండుగ కొనసాగుతోంది. ఇప్పటికే సొంతూళ్లకు చేరుకున్న ఆడపడుచులు సద్దుల బతుకమ్మకు సిద్ధమవుతున్నవారు. ఎంగిల పూలతో బతుకమ్మ మొదలవుతోంది. తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో పూల పండుగ ముగుస్తుంది. పలు ప్రాంతాల్లో ఏడు రోజుల్లో సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారు. తెలంగాణలో అతి పెద్ద పండుగగా బతుకమ్మ, దసరా నిర్వహిస్తారు. తెలంగాణ ఆడపడుచులు ప్రపంచంలో ఎక్కడున్నా మన సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు.
తాజాగా తెలంగాణ చెందిన ఎన్నారైలు ఐర్లాండ్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డబ్లిన్ లో 30 మంది తెలంగాణకు చెందిన వారు ఈ పండుగను ఘనంగా నిర్వహించారు. గత 12 సంవత్సరాలుగా ఈ బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. దాదాపు 30 మంది వాలంటీర్లు, 40 మంది దాతలు ముందుకొచ్చి బతుకమ్మ వేడుకలు జరిపారు. ఈ వేడుకలకు దాదాపు 900 మంది తెలుగు వారు హాజరయ్యారు. బతుకమ్మ వేడుకల్లో భాగంగా అమ్మాయిలు బతుకమ్మ, కోలాటం, దాండియా ఆడారు.

పెద్దలు పిల్లలకు బతుకమ్మ పండుగ గురించి వివరించారు. బతుకమ్మ వేడుకలు దుర్గా మాత పూజతో ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తమ పిల్లలతో పాటు అక్కడి వారికి తెలియజేయడానికి ఈ వేడుకలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బతుకమ్మ వేడుకలతో పాటు చిన్న పిల్లలకు మ్యాజిక్ షో నిర్వహించారు. అనంతరం బతుకమ్మను అందగా పేర్చి తీసుకువచ్చిన ఆడపడుచులకు బహుమతి అందజేశారు. వచ్చిన అతిధులకు ప్రసాదంతో పాటు స్నాక్స్ అందించారు. రాత్రి రుచికరమైన వంటలను రుచి చూపించారు.

ఈ బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు సిల్వెని శ్రీనివాస్, ప్రభోద్ మేకల, కోలన్ కమలాకర్ రెడ్డి, జగన్ మేకల, సాగర్ సిద్ధం, నవీన్ గడ్డం, ప్రదీప్ రెడ్డి యాలుక, షరీష్ బెల్లంకొండ, రమణ రెడ్డి యానాల, శ్రీనివాస్ అల్లే, వెంకట్ తిరుకోవలురు, సుమంత్ చావా, ప్రవీణ్లాల్, రామకృష్ణ కాటేపల్లి, రాజా రెడ్డి, బాచి రెడ్డి, నగేష్ పొల్లూరు, శశిధర్ మర్రి, శ్రీధర్ రాపర్తి, రవి కిరణ్ కుంచనపల్లి, బలరాం కొక్కుల, సునీల్ పాక, శంకర్ బెల్లంకొండ, వెంకట్ జూలూరి, శ్రీనివాస్ కార్ఫె, శ్రీనివాస్ అల్లంపల్లితో పాటు పలువురు సహకరించారు.













Click it and Unblock the Notifications