NRI News: కెనడా, హాంగ్ కాంగ్‍లో ఘనంగా బతుకమ్మ సంబురాలు..
తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. తాజాగా కెనడాలో బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించారు. క్యాల్గరీలోని బోనెస్ కమ్యునిటీ అసోసియేషన్' హాల్‌లో 'క్యాల్గరీ తెలంగాణ అసోసియేషన్' ఆధ్వర్యంలో దసరా, బతుకమ్మ ఘనంగా నిర్వహించారు. బతుకమ్మను రంగు రంగుల పువ్వులతో ఎన్నారై తెలంగాణ బిడ్డలు అందంగా లపేర్చారు. ఆ తర్వాత బతుకమ్మలను ఒక్క చోట పెట్టి బతుకమ్మ ఆడారు. అంతకు ముందు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఆల్బెర్టా ప్రావిన్స్ సాంస్కృతిక శాఖ మంత్రి మహ్మద్ యాసిన్, డిప్యూటీ మేయర్ వాంగ్ ప్రత్యేక అతిథిలుగా హాజరై బతుకమ్మ సంబురాలను ఎంజాయ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొంపల్లి సత్యం, బవండ్ల సుఖేష్, తముల అశ్విన్, పల్లె రవి అసోసియేషన్ నలహాదారులు సునిల్ రాజవరం పాల్గొన్నారు. ఇటు హాంగ్ కాంగ్ లో కూడా బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు.

సద్దుల బతుకమ్మను 'ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య' భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. లాంటౌ ద్వీపంలో కొత్తగా నిర్మించిన వాటర్ ఫ్రంట్ ప్రోమేనాడపై ఈ వేడుకలు వైభవంగా వేడుకలు నిర్వహించారు. మహిళలు, తమ కుటుంబాలతో వచ్చి గౌరమ్మకు పూజలు చేశారు. తర్వాత పాటలతో బతుకమ్మ ఆడారు.ఆట పాటల తర్వాత బతుకమ్మను సముద్రంలో నిమజ్జనం చేశారు. ఆపై ఇంటి నుంచి తీసుకువచ్చిన సత్తుపిండి వాయనాలను ఒకరికొకరు ఇచ్చుకున్నారు.
తమ సంస్థ ఆధ్వర్యంలో వరుసగా ఆరో ఏడాది బతుకమ్మ సంబరాలు నిర్వహించినట్ 'ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య' వ్యవస్థాపక అధ్యక్షురాలు జయ పీసపాటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి ధన్యవాదాలు చెప్పారు. సమాఖ్య సభ్యులు, వారి కుటుంబ సభ్యుల కృషివల్లే బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. నవంబర్‌లో కార్తిక వనభోజనాలు, దీపావళి వేడుకల ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications