US News: అమెరికాలో జాబ్ కలలు కుదరవ్.. ఇండియన్ విద్యార్థుల పెద్ద స్కామ్..! పూర్తి వివరాలు
NRI News: భారతదేశంలో ప్రస్తుతం ఉన్న చాలా మంది విద్యార్థులకు ఉండే కల బీటెక్ చేయటం మాస్టర్స్ కోసం అమెరికా, కెనడా, జెర్మనీ వంటి దేశాలకు వెళ్లటం. అయితే అక్కడ తగిన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని చాలా మంది పట్టించుకోవటం లేదు. గతంలో ఈ మార్కెట్లలో మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉండేవి కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఈ క్రమంలో చాలా మంది అక్కడే పార్ట్ టైమ్ జాబ్స్ చేస్తూ ఎలాగొలా నిలదొక్కుకుని మెల్లగా అక్కడే సెటిల్ అవ్వాలి అనే ఆలోచనలతో ముందైతే ఫారెన్ కంట్రీలోని యూనివర్సిటీల్లో సీటు కోసం ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.
అయితే తాజాగా రెడిట్ లో ఒక యూజర్ ఇలా మందలు మందలుగా ఇండియన్ విద్యార్థాలు అమెరికా యూనివర్సిటీలకు మాస్టర్స్ చేసేందుకు రావటంపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఉద్యోగాలపై వారి ఆశలు ఈ క్రమంలో వారు ఎదుర్కొనే కఠినమైన జాబ్ మార్కెట్‌తో సరిపోతాయా అని ప్రశ్నించారు. ఇలా మాస్టర్స్ చేయటం కోసం అమెరికాకు వెళుతున్న పిల్లలందరికీ అక్కడే ఉద్యోగాలు రావటం అనేది చాలా కష్టతరమైన అంశమని తాను భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. వాస్తవానికి అమెరికన్ ప్రజల పిల్లలకే ఇది ప్రస్తుత సమయంలో కష్టతరంగా ఉందని, జాబ్ మార్కెట్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆమె పేర్కొన్నారు. అమెరికాలో ఉద్యోగాల లభ్యత స్థాయి ఎలా ఉందనే విషయానికి ఇది అద్ధం పడుతుంది.

అమెరికా విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న 26 ఏళ్ల యువతి, కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్‌ను అభ్యసించడానికి తన ఉద్యోగి ప్రయోజనాలను ఉపయోగించుకుంది. ఆమె ప్రోగ్రామ్‌లోని విద్యార్థులలో 99% మంది భారతీయులే కావడం ఆశ్చర్యానికి గురిచేసింది. చాలా మంది విద్యార్థులు అమెరికన్ డిగ్రీని వర్క్ వీసాలు, యూఎస్ లో ఉద్యోగ భద్రత కోసం ఒక మార్గంగా చూస్తున్నారని ఆమె తెలుసుకుంది. అయితే ఆమె పోటీ మార్కెట్‌లో అవకాశాల గురించి సందేహాలను వ్యక్తం చేసింది. ఇదే క్రమంలో ఆమె విద్యార్థులపై ఉండే ఆర్థిక ఒత్తిడి గురించి కూడా రెడిట్ పోస్టులో ఆందోళన వ్యక్తం చేసింది. చాలా మంది దీని వల్ల అప్పులపాలవుతున్నారని, ప్రొఫెసర్లు కూడా మంచివారు కాకపోవటం వల్ల అమెరికాలో భారతీయ విద్యార్థులు ఉద్యోగం పొందటం కష్టతరం అవుతుందని అన్నారు. ఇదంటా పెద్ద స్కామ్ అని.. అనిశ్చిత రాబడితో ఖరీదైన పెట్టుబడని అన్నారు.
అలాగే ఆమె ఆమెరికాకు కోటి కలలతో వస్తున్న విద్యార్థులపై సానుభూతి వ్యక్తం చేసింది. నిజాయితీగా చాలా మంది అమెరికాకు రావటానికి ముందే భవిష్యత్తులో వచ్చే అడ్డంకులను పూర్తిగా అర్థం చేసుకోవాలని ఆమె సూచించారు. అలాగే అంతర్జాతీయ విద్యార్థులు క్లాసులో ప్రొఫెసర్ ఉన్న సమయంలోనే గట్టిగా మాట్లాడుతున్నారని అది అమెరికన్ క్లాస్‌రూమ్‌లో ఎప్పటికీ సహించబడదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications